టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్( Mahesh Babu ) ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు మహేష్.
కాగా మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో( Guntur Karam Movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 70 శాతం పూర్తి అయింది.కాగా ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.
కాగా అతడు ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్( Trivikram ) కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి, ధమ్ మసాలా సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.2024 సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు రెండు నెలల ముందే థియేట్రికల్ బిజినెస్( Theatrical Business ) ఒక రేంజ్ లో జరిగినట్లు తెలుస్తోంది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గుంటూరు కారం వంద కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం.నైజాంలో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.50 కోట్లు, సీడెడ్ లో రూ.15 కోట్ల బిజినెస్ చేసిందట.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.110 కోట్ల బిజినెస్ చేసిందన్నమాట.ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ.30 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.