రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆమె కన్నుకొట్టి కోట్ల మంది కుర్రాళ్ళ గుండెలపైకి వేసిన బాణం చాలా మందికి తగిలింది.
దాంతో ఉన్నపళంగా యూత్ ఆమెని ఫేమస్ చేసేశారు.సోషల్ మీడియాలో విపరీతంగా ఆమెని ఫాలో అవుతూ వచ్చారు.
ఆ క్రేజ్ తోనే ఈ భామ ఊహించని విధంగా పెద్ద పెద్ద కంపెనీలకి యాడ్స్ చేసే అవకాశం సొంతం చేసుకుంది.అయితే మొదటి సినిమా రిలీజ్ తర్వాత ఊహించని ప్రియా ప్రకాష్ క్రేజ్ అమాంతం పడిపోయింది.
ఆడియన్స్ ఊహించిన స్థాయిలో ఆ సినిమా ప్రియా ప్రకాష్ వారియర్ పాత్ర లేకపోవడం దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి.ఇదిలా ఉంటే ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో ఈ భామ శ్రీదేవి బంగ్లా అనే టైటిల్ తో ఓ సినిమాలో నటించింది.
బాలీవుడ్ లో ఇదే ఆమె మొదటి సినిమా.దీని మీద ప్రియా ప్రకాష్ వారియర్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.అయితే ఈ సినిమా కథ, కథనం అతిలోక సుందరి శ్రీదేవి జీవితంలో జరిగిన సంఘటనలు, ఆమె మరణం చుట్టూ అల్లుకున్న సంఘటనలతో తెరకెక్కించినట్లు గుర్తించిన నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమాని ఆపాలని కోర్టులో కేసు వేశారు.శ్రీదేవి బయోపిక్ కి ఎవరికీ ఎలాంటి హక్కు లేదని అలాగే ఆమె మరణాన్ని వక్రీకరించి విధంగా సినిమా కంటెంట్ ఉందని, టైటిల్ లో కూడా శ్రీదేవి ఆమె పేరు ఉపయోగించడంపై అభ్యంతరం ఉందని పిటీషన్ లో పేర్కొన్నారు.
దీంతో శ్రీదేవి బంగ్లా సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది.అయితే మరల ఏం జరిగిందో ఈ సినిమాకి మోక్షం వచ్చినట్లు కనిపిస్తుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.చిత్రం అఫీషియల్ ట్రైలర్‌ను ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ట్విట్టర్‌లో విడుదల చేసి యూనిట్‌కు గుడ్‌లక్ చెప్పారు.
ఈ చిత్రం ప్రశాంత్ మాంబులి దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉండగా.అర్బాజ్‌ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నారు.