ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు సంచలనంగా మారింది.రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కంటెంట్ క్రియేట్ చేసి వాటి ద్వారా లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణలురావడంతో ముంబై పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ కేసులో భాగంగా రాజ్ కుంద్రా భార్య, నటి, శిల్పాశెట్టిను కూడా పోలీసులు విచారిస్తున్నారు.ఈ క్రమంలోనే కాంట్రవర్సి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోర్నోగ్రఫీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ… ఫోర్న్ అనేది 2000 సంవత్సరాల క్రితం నాటిది.రోమ్ లో జరిగిన తవ్వకాలలో ఫోర్న్ పెయింటింగ్స్ బయటపడ్డాయి.
ఫోర్న్ అనేది మనుషులు సృష్టించినది కాదు.అది దేవుడు పెట్టిన అంశ ఫోర్న్ అనేది సినిమా అయినా కావచ్చు,పెయింటింగ్ అయినా కావచ్చు అంటూ రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి పై పెట్టిన కేసు గురించి తాను మాట్లాడటం లేదని.ఆ కేసు గురించి పూర్తి వివరాలు నాకు తెలియదు కనుక నేను ఈ కేసు గురించి ఎలాంటి ట్వీట్ చేయలేదని తెలిపారు.పోర్నోగ్రఫీ అనేది తప్పు కాదు.ఎవరైనా బలవంతం చేస్తే అది తప్పు అంటూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.రామ్ గోపాల్ వర్మ పోర్నోగ్రఫీ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.