Jio Cloud Gaming : గేమింగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో క్లౌడ్ గేమింగ్ ఇండియాలో లాంచ్!

రిలయన్స్ జియో గేమింగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ గుడ్ న్యూస్ చెప్పింది.గేమింగ్ ప్రియుల కోసం కొత్త క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ జియోగేమ్స్ క్లౌడ్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది.

 Good News For Gaming Lovers Jio Cloud Gaming Launched In India , Cloud Gaming, J-TeluguStop.com

ఇందులో గేమర్లు చాలా కేటగిరీలలో రకరకాల గేమ్స్ ఆడుకోవచ్చు.ఇందుకు కావలసిందల్లా స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్పవచ్చు.

JioGames క్లౌడ్‌కి సైన్ ఇన్ (Sign in) చేసుకోవడం ద్వారా గేమ్‌లను ఇన్‌స్టాల్ చేయకుండా, డౌన్‌లోడ్ చేయకుండా లేదా అప్‌డేట్ చేయకుండా కంప్యాటబుల్ డివైజ్‌లలో ఆడుకోవచ్చు.చాలా గేమ్‌లను ఆన్‌లైన్‌లో ప్లే చేయడం సాధ్యమవుతుంది కాబట్టి యూజర్లు తమ మొబైల్‌లో స్టోరేజ్ కోల్పోకుండా ఉంటుంది.

ఈ జియో గేమ్స్ క్లౌడ్ సర్వీసులు స్మార్ట్‌ఫోన్లు, వెబ్ బ్రౌజర్‌లు, జియో సైట్‌లోని JioGames యాప్‌లో అందుబాటులో ఉంటాయి.ఈ జియో ప్లాట్‌ఫామ్‌లో సెయింట్స్ రో: ది థర్డ్, సెయింట్స్ రో IV, కింగ్‌డమ్ కమ్ డెలివరెన్స్, బిహోల్డర్, డెలివర్ అస్ ది మూన్, ఫ్లాష్‌బ్యాక్, షాడో టాక్టిక్స్: బ్లేడ్స్ ఆఫ్ ది షోగన్ వంటి 50కి పైగా హై-క్వాలిటీ గేమ్స్ ఉండటం విశేషం.వీటిని జియో యాప్స్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు నేరుగా ఆడుకోవచ్చు.జియో క్లౌడ్ లో స్టీల్ ర్యాట్స్, విక్టర్ Vran, Blacksad: అండర్ ది స్కిన్, గార్ఫీల్డ్ కార్ట్ ఫ్యూరియస్ రేసింగ్ వంటి గేమ్స్ కూడా ఫోన్ యూజర్లు ఆడుకోవచ్చు.

Telugu Cloud, Jio Cloud Platm, Jio Games, Jio-Latest News - Telugu

జియో నెట్‌వర్క్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ గేమ్స్ ఆడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.ఇందుకు మొదటగా యూజర్లు https://cloud.jiogames.com/కి వెళ్లాలి.లేదంటే ప్లే స్టోర్ ద్వారా JioGames: ప్లే, విన్, స్ట్రీమ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయాలి.మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్/ట్యాబ్లెట్‌లో ప్లే, విన్, స్ట్రీమ్ యాప్ అందుబాటులో ఉంది.మీ డివైజ్ ఎంచుకున్నాక.

మీ మొబైల్ నంబర్ ద్వారా యాప్ లేదా వెబ్ బ్రౌజర్‌కి సైన్ ఇన్ చేయాలి.ఓటీపీని రిజిస్టర్ చేయడం ద్వారా సైన్ ఇన్ చేయవచ్చు.

తర్వాత లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న క్లౌడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి నచ్చిన గేమ్‌ని ఎంచుకుని ఆడుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube