తిరుపతి శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ శాల లో అగరబత్తులు తయారీ కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ వై.వి.
సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ఎ.వి.ధర్మా రెడ్డి తో కలిసి సోమవారం ప్రారంభించారు.అనంతరం వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం తో డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై ఎంవోయూ కుదుర్చుకున్నారు.మల్టీకలర్ తో ఆకర్షణీయంగా రూపొందించిన సప్తగిరి మాస పత్రికను పునః ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఆలయాల్లో స్వామి, అమ్మవార్ల కైంకర్యాలకు ఉపయోగించిన పుష్పాలతో సప్తగిరి సూచికగా ఏడు బ్రాండ్ లతో అగరబత్తులు తయారు చేసి సోమవారం నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు చెప్పారు.బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ సొంత ఖర్చుతో యంత్రాలను ఏర్పాటు చేసి, సిబ్బందికి నియమించుకుని అగరబత్తులు తయారు చేసి టీటీడీకి అందిస్తుందన్నారు.
అలాగే టీటీడీ ఆలయాల్లో వినియోగించిన పూలతో స్వామి, అమ్మవార్ల ఫోటోలు తయారుచేయడానికి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు.ఇందుకోసం తిరుపతిలోని ఆ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన కేంద్రం లో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.రూ.83 లక్షలతో పరికరాలు, శిక్షణ నిధులను టీటీడీ సమకూరుస్తుందని తెలిపారు.ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్.గోపాల్, టీీీటీడట జనరల్ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ రామ్ ప్రసాద్ ఎంవోయూ పై సంతకాలు చేశారు.

ఒప్పంద పత్రాలను టీటీడీ చైర్మన్, వర్సిటీ ఉపకులపతి డాక్టర్ టి.జానకిరామ్ మార్చుకున్నారు.ఈ కార్యక్రమంలో జేఈఓ సదా భార్గవి, సివిఎస్ఓ గోపీనాథ్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్.పద్మనాభరెడ్డి, టీటీడీ సిఇ నాగేశ్వరరావు, గో సంరక్షణశాల డైరెక్టర్ డాక్టర్.
హరినాథ్ రెడ్డి, దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, అశోక్, సప్తగిరి మాసపత్రిక ముఖ్య సంపాదకులు రాదా రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు.కాగా టీటీడీ అగరవత్తుల విక్రయాలను సోమవారం నుంచి తిరుమల లడ్డు కౌంటర్ వద్ద శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుస్తకాలు విక్రయశాల వద్ద ఉన్న ఒక కౌంటర్ లో ప్రారంభించారు.