ప్రధాని నరేంద్ర మోడీపై( PM Narendra Modi ) ప్రశంసల వర్షం కురిపించారు అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త దర్శన్ సింగ్ ధాలివాల్.( Darshan Singh Dhaliwal ) భారతదేశాన్ని ప్రపంచపటంలో వుంచడంతో పాటు సిక్కు సమాజానికి( Sikh Community ) అండగా నిలుస్తున్నందుకు గాను మోడీని ఆయన కొనియాడారు.ఇటీవల వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) ఇచ్చిన స్టేట్ డిన్నర్‌లో మోడీని దర్శన్ సింగ్ కలిశారు.72 ఏళ్ల దర్శన్ సింగ్ దాదాపు 50 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు.గతంలో భారతదేశం గురించి పశ్చిమ దేశాలకు పెద్దగా అవగాహన లేదని, కానీ ఇప్పుడు పరిస్ధితులు మారిపోయాయని దర్శన్ సింగ్ పేర్కొన్నారు.మోడీ కారణంగా ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూడటం ప్రారంభించిందన్నారు.

అలాగే సిక్కు సంక్షేమం కోసం కూడా మోడీ చాలా చేశారని ధాలివాల్ కొనియాడారు.గురుద్వారాలు, ఇతర ప్రదేశాల్లో వుండే సిక్కు లంగర్‌లపై ప్రధాని 18 శాతం జీఎస్టీని ఎత్తివేశారని గుర్తుచేశారు.గత ప్రధానులు చేయడానికి సాహసించని కర్తార్‌పూర్ కారిడార్‌ను( Kartarpur Corridor ) పూర్తి చేశారని దర్శన్ సింగ్ కొనియాడారు.ఛోటా సాహిబ్జాడే (గురు గోవింద్ సింగ్ కుమారుల ఆత్మబలిదానం చేసిన రోజు) ను ‘‘ వీర్ బల్ దివాస్’’గా ప్రకటించారని ధాలివాల్ ప్రశంసించారు.
అంతేకాకుండా మోడీ తనను భారత్‌కు ఆహ్వానించారని , త్వరలోనే ఇండియా వచ్చి ఆయనతో గడుపుతానని దర్శన్ సింగ్ చెప్పారు.ఇక.కెనడాతో పాటు పలుదేశాల్లో విస్తరిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాదం , భారత వ్యతిరేక శక్తుల గురించి ఆయన స్పందించారు.కొందరు తమ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని దర్శన్ సింగ్ పేర్కొన్నారు.

కాగా.రైతుల ఆందోళనకు మద్ధతుగా నిలబడ్డ దర్శన్ సింగ్ ధాలివాల్‌ను కేంద్రం ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే.ఉద్యమం సమయంలో దర్శన్ సింగ్ ఢిల్లీ శివార్లలోని సింఘూ బోర్డర్‌లో లంగర్ నిర్వహించి రైతులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో దర్శన్ సింగ్ తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు 2021 అక్టోబర్ 23న చికాగో-ఢిల్లీ విమానంలో భారత్‌కు వచ్చారు.అయితే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు దర్శన్ సింగ్‌ను అడ్డుకుని భారత్‌లో అడుగుపెట్టేందుకు అనుమతి నిరాకరించారు.
ఐదు గంటల హైడ్రామా తర్వాత ఆయనను అదే విమానంలో తిరిగి అమెరికాకు పంపించారు.