ఎన్టీఆర్‌ 'దేవర' వచ్చే సమ్మర్‌ లో సోలో రిలీజ్ సాధ్యమేనా?

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌( Young Tiger NTR ) హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.కొరటాల శివ గత చిత్రం ఆచార్య సినిమా అట్టర్‌ ఫ్లాప్ అవ్వడంతో మొదట ఈ సినిమా పై కొందరికి అనుమానాలు ఉన్నాయి.

 Ntr Devara Movie Shooting And Release Date , Ntr, Koratala Shiva, Janhvi Kapoor-TeluguStop.com

కానీ ఎన్టీఆర్ యొక్క లుక్ మరియు హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) యొక్క లుక్ చూసి సినిమా పై అంచనాలు పెరిగాయి.పాజిటివ్ గా సినిమా గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది.

ఇదే సమయంలో సినిమా కథ గురించి మరియు ఇతర విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.దాంతో ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా దేవర సినిమా( Devara movie ) ను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు.సినిమా యొక్క అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుంది అంటూ అభిమానులు మరియు యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా ఉన్నారు.ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రకటించినట్లుగా వచ్చే ఏడాది లో సమ్మర్‌ కానుకగా వచ్చేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకంటే సినిమా షూటింగ్ చాలా స్లోగా సాగుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ సినిమా పై చాలా ఎక్కువ శ్రద్ద పెడుతున్నాడట.తన గత సినిమాల తో పోల్చితే ఈ సినిమా కు అదనంగా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి సినిమా కు కొరటాల కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్న కారణంగా సమ్మర్ లో విడుదల అయ్యేనా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఎంత స్లో గా చేసినా కూడా నవంబర్ లేదా డిసెంబర్ వరకు షూటింగ్‌ పూర్తి అవ్వనుంది.

వచ్చే సమ్మర్‌ లో సినిమా విడుదల అవ్వనుంది అంటూ యూనిట్‌ సభ్యులు కొందరు ఆఫ్ ది రికార్డ్‌ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube