తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల( Assembly elections in Telangana ) ప్రచారం చివరి దశకు చేరుకోవటంతో ఇప్పుడు ఢిల్లీ నేతలు హైదరాబాదులో వాలిపోతున్నారు.5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం లో రాజస్థాన్ ఎన్నికల ప్రచార గడువు కూడా ముగిసిపోవడంతో ఇక చివరిదైనా తెలంగాణపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.దాంతో ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్ లో వాలిపోతున్నారు .జాతీయ కాంగ్రెస్( Congress ) పెద్దలు మల్లికార్జున్ ఖర్గే , రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ,చిదంబరం తో సహా పలువురు పెద్దలు ఇప్పటికే హైదరాబాదుకు కు వస్తున్నట్టుగా తెలుస్తుంది .

వచ్చే ఈ నాలుగు రోజులు ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ఇక తెలంగాణ కేంద్రంగానే సభలు సమావేశాలతో ఎన్నికల వేడిని పెంచ బోతునట్టుగా తెలుస్తుంది.ఆ దిశగా హైదరాబాద్ నగరం లోని అన్నీ ప్రదాన హోటళ్లు ఈ రాజకీయ పెద్దల ఆగమనం తో కిటకిట లాడుతున్నాయట .రాష్ట్ర నేత ల ప్రచారానికి తోడు ఈ జాతీయ నేతల ప్రచారం కూడా కలిస్తే తెలంగాణ లో రాజకీయం పీక్ స్టేజ్ కి చేరుతుంది అనడం లో సందేహం లేదు.మరోవైపు బిజెపి( BJP ) వైపు నుంచి కూడా ప్రధాని మోడీ మినహా మిగిలిన కీలక నేతలు ముఖ్య మంత్రి స్తాయి నేతలు హైదరాబాద్ ను రౌండ్అప్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదైన తెలంగాణ ఎన్నికలపై ఇప్పుడు పార్టీలు పూర్తిస్థాయిలో నజర్ పెట్టాయి , బిజెపి నుంచి యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ , మధ్యప్రదేశ్ సీఎం శివరాం సింగ్ చౌహన్, హోం మంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్ కు విచ్చేస్తున్నట్లుగా తెలుస్తుంది.మరోవైపు సిపిఎం మరియు సిపిఐ నుంచి కూడా కేంద్ర స్థాయి నేతలు ప్రచారానికి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది అని తెలుస్తుంది ,ఇలా ఆలూ పెరగకుండా ఐదు రాష్ట్రాలను ఎన్నికల్లో పోటాపోటీగా చేస్తున్న ప్రచారాలు చివరికి ఏ పార్టీకి విజయాన్ని కట్టబడుతాయో చూడాలి