టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ సెంటిమెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.ముఖ్యమైన వాళ్లతో ఫోన్ లో మాట్లాడటానికి కూడా బాలయ్య ముహూర్తాలు చూసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
వాస్తవానికి బాలయ్య హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాను డిసెంబర్ నెల 23వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు.మొదట బాలయ్య కూడా ఆ తేదీకి సినిమాను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపారు.
గతేడాది విడుదలైన అఖండ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కడం ఆ సినిమాకు ఊహించని స్థాయిలో ప్లస్ అయింది.అయితే మొదట డిసెంబర్ 23వ తేదీకి ఫిక్స్ అయిన బాలయ్య ఆరోజు అమావాస్య అని తెలిసి సినిమా రిలీజ్ కు నో చెప్పారని సమాచారం అందుతోంది.
సాధారణంగా పెద్ద సినిమాలను శుక్రవారం రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది.డిసెంబర్ 23వ తేదీన శుక్రవారం కావడంతో పాటు అమావాస్య కూడా కావడంతో బాలయ్య నిర్ణయం మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
తిథులు, ముహూర్తాలు, నక్షత్రాలను నమ్మే బాలయ్య అమావాస్య రోజున సినిమాను రిలీజ్ చేయవద్దని కోరడంతో పాటు సినిమాను ప్రీ పోన్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో నిర్మాతలు చివరకు తాము నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమాకు పోటీగా వీరసింహారెడ్డిని విడుదల చేస్తున్నారు.వీరసింహారెడ్డి ఇంటర్వెల్ సీన్ లో ఎమోషనల్ ట్విస్ట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇంటర్వెల్ లో బాలయ్య శృతి హాసన్ పాత్రలకు సంబంధించి షాకింగ్ నిజం వెల్లడవుతుందని బోగట్టా.అయితే ఆదిపురుష్ సినిమా పోస్ట్ పోన్ కావడంతో సంక్రాంతి సందడి చిరంజీవి బాలయ్యలదే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.సంక్రాంతి పండుగకు ఎన్ని సినిమాలు విడుదలైనా థియేటర్ల ఓనర్లు సైతం ఈ రెండు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒకటి కాగా 2023 సంక్రాంతి పోటీ మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.







