వావ్, గాల్లో తేలుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్..!

మానవుడు తన మేధస్సును ఉపయోగించి ఎంతటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేసి చూపిస్తాడు.గాలిలో, నీటిలోపల, నీటిపై ఇలా ఎక్కడైనా ప్రయాణించగల వాహనాలను మానవుడు తయారు చేయగలిగాడు.

 Man Enjoying Nature Floating In The Gall .video Goes Viral Air, Viral Latest, Viral News, Social Media, Viral Video, Enjoyed-TeluguStop.com

అయితే మానవుడు తయారుచేసే ఆవిష్కరణలు ఒక్కోసారి మనల్ని అబ్బురపరుస్తాయి.అలాంటి ఆవిష్కరణలలో జెట్ ప్యాక్ సూట్ ఒకటని చెప్పవచ్చు.

దీనిని ధరిస్తే నేలపై నుంచి గాల్లోకి ఈజీగా ఎగరవచ్చు.విమానాలు, హెలికాప్టర్లు లేకుండా కేవలం ఒక బ్యాగ్ లాంటి జెట్ ప్యాక్ సూట్ ధరించి గాల్లో ఎగరడం అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

 Man Enjoying Nature Floating In The Gall .Video Goes Viral Air, Viral Latest, Viral News, Social Media, Viral Video, Enjoyed -వావ్, గాల్లో తేలుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ఒక వ్యక్తి ఇలాంటి అనుభూతిని పొందుతూ ఎంజాయ్ చేశాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి గాల్లో తేలుతూ ప్రకృతి ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్లడం చూడొచ్చు.

ఇతడు తన వీపు కి ఒక యాంటీ గ్రావిటీ జెట్ ప్యాక్ ధరించాడు.అనంతరం ఐరన్ మ్యాన్ సినిమాలో హీరోలాగా గాల్లో తేలుతూ ఇతను అడవిని చుట్టేశాడు.దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.గేమ్స్ లేదా సినిమాల్లో లాగా అతను హాయిగా గాల్లో తేలుతూ ఉంటే ఏదో మంత్రజాలం చూస్తున్నట్లుగానే అనిపించిందని కామెంట్లు పెడుతున్నారు.ఇలాంటి జెట్ ప్యాక్ తమకు కూడా కావాలని కొందరు తమ కోరికను బయటపెట్టారు.అయితే ఈ జెట్ సూట్ ధర కనీసం రూ.3 కోట్లకు పైగా ఉంటుంది.హైడ్రోజన్ పెరాక్సైడ్-ఆధారిత ఇంజిన్‌తో ఇవి పని చేస్తాయి.

ఎర్త్ పిక్స్ అనే ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ దీనిని షేర్ చేసింది.దీనికి ఇప్పటికే లక్షల వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.

ఈ అబ్బురపరిచే వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube