టాలీవుడ్ మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ( Boyapati Sreenu ) దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం స్కంధ( Skanda ).ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఇందులో భాగంగానే ఈ సినిమా నుంచి కల్ట్ మామా అంటూ సాగే స్పెషల్ సాంగ్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఇక ఈ పాటలో రామ్ పోతినేని సరసన నటి ఊర్వశీ రౌతేలా( Urvashi Rautela ) నటించిన సంగతి మనకు తెలిసింది.ఇక తాజాగా ఈ పాట లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఊర్వశి రామ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఈమె ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నటించిన వాల్తేరు వీరయ్య లో కూడా స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.తాజాగా చిరంజీవి గారితో సినిమా చేసే సమయంలో ఆయన నువ్వు ఇండస్ట్రీలో ఇద్దరు సూపర్ డాన్సర్లతో డాన్స్ చేయబోతున్నావు ఒకటి నేను ఇంకొకటి రామ్ తో నువ్వు డాన్స్ చేయబోతున్నావు అంటూ ఆయన తెలియజేశారు.
ఇక ఆరోజు మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ గురించి చెప్పినది నిజమేనని ఈ సందర్భంగా ఊర్వశి వెల్లడించారు.ఈయన ఒక అద్భుతమైన డాన్సర్ ఎలాంటి కష్టమైన మూమెంట్ అయినా కూడా సింగిల్ టేక్ లో కంప్లీట్ చేస్తారు.ఈయన ఒక గొప్ప డాన్సర్ అంటూ ఈ సందర్భంగా రామ్ పోతినేని డాన్స్ పై ఊర్వశి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో రామ్ సరసన నటి శ్రీ లీల( Sree Leela ) నటించిన విషయం మనకు తెలిసిందే.