టిష్యూ పేపర్ తో కరోనా కి చెక్ పెట్టిన మెగా కోడలు...

సమాజానికి ఉపయోగపడేటువంటి పనులను చేయడంలో మెగా కోడలు ఉపాసన కొణిదల ఎప్పుడూ ముందు ఉంటుంది.

ప్రపంచాన్ని ప్రస్తుతం గడగడలాడిస్తున్న టువంటి కరోనా వైరస్ అరికట్టేందుకు నివారణ చర్యల్లో భాగంగా ఉపయోగించేటటువంటి మాస్క్ లను తమకు తామే సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది.

అంతేగాక కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.

ఇందులో భాగంగా కరోనా వైరస్ గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదని పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ ని రాకుండా అడ్డుకోవచ్చని అన్నారు.ఇందులో ముఖ్యంగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కరచాలనం చేయకుండా నమస్కారం చేయడం మంచిదని అన్నారు.

 అలాగే ఇతరులతో మాట్లాడే సమయంలో వ్యక్తుల మధ్య కొంచెం దూరంగా ఉంటే మంచిదన్నారు.అలాగే దగ్గు, జలుబు ఉన్నటువంటి వారు మాస్కులు ఉపయోగిస్తే ఇతరులకి ఇన్ఫెక్షన్ లక్షణాలు సోకకుండా ఉంటాయని అన్నారు.

Advertisement

ఈ మాస్కులు ఉపయోగించిన తర్వాత మాస్క్ ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం చేయరాదని అందుకు గానూ  డస్ట్ బిన్ లో మాత్రమే ఉపయోగించాలని అన్నారు.

అయితే ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్ పేజీలను పలువురు మహిళల చేతిలో పెడతానని దేశ అభివృద్ధికి కావాల్సిన సలహాలు ఇవ్వమని కోరగా వెంటనే ఉపాసన కొణిదెల స్పందించి దేశానికి కావలసినటువంటి ఆరోగ్య సలహాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు