బడ్జెట్ తక్కువ.. కంటెంట్ మాత్రం అద్భుతం.. కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు అందించిన సినిమాలివే!

సాధారణంగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందడం సులువు కాదు.ప్రతి సంవత్సరం విడుదలవుతున్న లో బడ్జెట్ సినిమాలలో చాలా సినిమాలు ఎప్పుడు థియేటర్లలో విడుదలయ్యాయో కూడా చాలామంది సినీ అభిమానులకు( movie fans ) తెలియదు.

 Less Budget High Collections Movies Details Here Goes Viral In Social Media , Ka-TeluguStop.com

అయితే కొన్ని సినిమాలు మాత్రం పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి.

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో కార్తికేయ2 సినిమా( Karthikeya 2 movie ) కూడా ఒకటి.

నిఖిల్( Nikhil ) చందూ మొండేటి కాంబినేషన్ లో కృష్ణతత్వంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడం గమనార్హం.ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించడంతో పాటు నిఖిల్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాతో బిజీగా ఉన్నారు.

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సంచలన విజయం సాధించిన మరో సినిమా ఏదనే ప్రశ్నకు కాంతార సినిమా పేరు జవాబుగా వినిపిస్తుంది.రక్షిత్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.కాంతార సినిమా( Kantara movie ) 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో సక్సెస్ సాధించడం గమనార్హం.

ఈ ఏడాది హనుమాన్ మూవీ( Hanuman movie ) తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కొన్నిరోజుల ముందు విడుదల కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.హనుమాన్ మూవీ నిర్మాతలకు ఊహించని రేంజ్ లో లాభాలను అందించిన సంగతి తెలిసిందే.

తేజ సజ్జా తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం భారీ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube