చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన బలవర్ధక ఆహారం పాలు.అన్ని రకాల పోషకాలు ఉండే పాలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎదుగుదల ఉంటుంది.
అయితే వైద్య నిపుణులు మాంసాహారం తీసుకున్న వెంటనే పాలను తీసుకోవద్దని సూచిస్తున్నారు.వైద్యులు ఇలా చెప్పడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి.
మాంసాహారం తినడం వల్ల మన శరీరంలో ప్రోటీన్ స్థాయిలు పెరుగుతాయి.
పాలలో కూడా ప్రోటీన్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది.
అందువల్ల మాంసాహారం, పాలు ఒకేసారి తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పెరుగుతాయి.శరీరానికి యూరిక్ యాసిడ్ అవసరమే.
కానీ అవసరానికి మించిన యూరిక్ యాసిడ్ వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం ఉండదు.ఎక్కువ మొత్తంలో ఉండే యూరిక్ యాసిడ్ ను బయటకు పంపించడం కూడా అంత సులభం కాదు.
మాంసం తినగానే పాలు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
ఇవి రెండూ ఒకేసారి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
ఎక్కువ కాలం నిల్వ ఉన్న యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ గా ఏర్పడుతుంది.ఈ క్రిస్టల్స్ వల్ల గౌట్, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
రెండూ ఒకేసారి తీసుకున్న వాళ్లకు అజీర్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.అందువల్ల పాలు, మాంసం ఒకేసారి తీసుకోకపోవడమే మంచిది.