సౌత్ ఇండియాలో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు మురుగదాస్.స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు తీసిన అందులో అంతర్లీనంగా ఒక సోషల్ ఎలిమెంట్ ని మురుగదాస్ తన ప్రెజెంట్ చేస్తూ ఉంటాడు.
అలాగే తన సినిమాలలో హీరో కూడా ఆరంభంలో సాధారణంగా ఉంటూ తరువాత అసాధారణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు.ఇలా ప్రేక్షకులకి కావాల్సిన పంక్తు కమర్షియల్ ఫార్ములాలో సినిమాలు తీసే మురుగదాస్ కి తెలుగులో మాత్రం సక్సెస్ దక్కలేదు.
కెరియర్ ఆరంభంలో అతను చిరంజీవితో స్టాలిన్ అనే సినిమా తీశాడు.ఆ సినిమా కంటెంట్ బాగున్నా ఎందుకనో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.
ఇక తరువాత చాలా గ్యాప్ తీసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ అనే సినిమాని తెరకెక్కించాడు.ఈ సినిమాలో మురుగదాస్ తన ఫార్ములాని పూర్తిగా పక్కన పెట్టి సైకో థ్రిల్లర్ కథాంశంగా ఆవిష్కరించారు.
అయితే ఈ సినిమా మహేష్ కెరియర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.నిర్మాతలకి కూడా భారీ నష్టాలు మిగిల్చింది.
ఇందులో గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క ఎలిమెంట్ కూడా కనిపించదు.మురుగదాస్ మహేష్ కోసం అలాంటి కథ ఎందుకు ఎంచుకున్నాడు అనేది చాలా మందికి అర్ధం కాదు.
కాని మురుగదాస్ కి మాత్రం స్పైడర్ కథా భాగా నచ్చింది.అయితే మహేష్ బాబుకి సూపర్ హిట్ ఇవ్వలేకపోవడం తన జీవితంలో పెద్ద వెలితి అని చాలా సందర్భాలలో మురుగదాస్ చెప్పుకొచ్చాడు.
ఈ సారి కచ్చితంగా సాలిడ్ హిట్ ఇస్తానని కూడా చెప్పాడు.ప్రస్తుతం విజయ్ తో తుపాకీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు కోసం ఒక అద్బుతమైన కథ సిద్ధం చేశానని త్వరలో అతనిని కలిసి కథ చెబుతానని చెప్పుకొచ్చాడు.
ఈ సారి కచ్చితంగా ఈ కథతో మహేష్ బాబుకి హిట్ ఇస్తానని తన కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశాడు.అయితే మహేష్ మళ్ళీ మురుగదాస్ కి ఎంత వరకు అవకాశం ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికర విషయంగా మారింది.
.