వైసిపి పాలనను విమర్శించే హక్కు చంద్రబాబు, పవన్ కు లేదని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు.శ్రీకాకుళం జిల్లా పలాస ప్రగతి భవన్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ వైసిపి విముక్తి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కావాలో చంద్రబాబు ఆయన దట్టపుత్రుడు చెప్పాలని డిమాండ్ చేశారు.
జన్మభూమి కమిటీలతో ప్రజలు ఇబ్బంది పడ్డారని కావాలా లేక
వైసిపి పాలనలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పథకాలు అందించడం వలన వైసిపి విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలా అని మంత్రి ప్రశ్నించారు.సంపద సృష్టిస్తామని చెబుతున్న చంద్రబాబు గతంలో ప్రజల కోసం ఏం సంపద సృషించారో చెప్పాలన్నారు.
కుటుంబ సభ్యులకు బంధువులకు పార్టీ నేతలకు సంపద సృష్టించారు తప్ప పేద ప్రజల సంపదను పెంచే పనులను చేయలేదని ద్వజమెత్తారు.







