ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారు.అసలు ఎన్నికలకు ముందే జగన్ ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం, ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అన్నిటినీ గమనించి ఎన్నికల మ్యానిఫెస్టోలో నవరత్నాలు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు.
అంతేకాదు, మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు.ఆ పథకాలు మళ్లీ తమను 2024 ఎన్నికల్లో గెలిపిస్థాయి అనే నమ్మకంతో జగన్ ఉన్నారు.
దీనికితోడు ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి ప్రభావం బాగా కనిపించింది.దీంతో ఇక తమకు తిరిగే లేదు అనే విషయాన్ని జగన్ గుర్తించారు.
తమపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, జనాల్లోకి వెళ్లడం లేదనే నమ్మకంతో జగన్ ముందుకు వెళ్తున్నారు.
సంక్షేమ పథకాల అమలు కోసం వేల కోట్లను కుమ్మరిస్తూ, తమ హామీలను నిలబెట్టుకుంటూ వస్తున్నారు.
అయితే మొదట్లో ఉన్నంత సానుకూలత ఇప్పుడు ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి.ఏపీలో సంక్షేమ పథకాలు వరకు సంతృప్తి ఉన్నా, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో లేకపోవడం, ఏపీలో రోడ్లు పూర్తిగా ధ్వంసం అవ్వడం, ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఇవన్నీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన, బీజేపీ వంటి పార్టీలకు వరంగా మారాయి.
వీటిని హైలెట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ను అభాసుపాలు చేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి.ముందు ముందు ఇదే పరిస్థితి కొనసాగితే తాము మరింత ఇబ్బందుల్లో చిక్కుకుంటాము అనే ఆలోచనతో జగన్ ఇక జనాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పటివరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి జగన్ పరిమితమవుతున్నారు.ఏపీలో ఎటువంటి సంఘటనలు చేసుకుంటున్న, జగన్ మాత్రం బయటకు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు.పూర్తిగా అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు.అయితే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోవడం వల్ల ప్రతిపక్షాలకు లాభం చేకూరుతుందనే అభిప్రాయం జగన్ లో ఉంది.
అందుకే ఆ పరిస్థితిని మార్చేందుకు నిత్యం జనాల్లో ఉంటూనే తన పరిపాలన కొనసాగించాలని జగన్ అభిప్రాయపడుతున్నారు.ఈ మేరకు త్వరలోనే దీనికి వాస్తవ రూపం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.