టీడీపీ, జనసేనలు మార్గదర్శికి, రామోజీరావుకు అనుకూలంగా స్టేట్మెంట్లిచ్చాయి - ఉండవల్లి

ఎంబీ విజ్ఞాన కేంద్రం, విజయవాడ: స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో రామోజీరావు మార్గదర్శి అక్రమాలు- నిజానిజాలపై సదస్సు.మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

 Undavalli Arun Kumar Fires On Tdp Janasena Over Ramojirao Margadarshi Issue, Und-TeluguStop.com

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేసు వాదిస్తున్న వ్యక్తి సత్యనారాయణ ప్రసాద్.ఎన్టీఆర్ లాంటి వ్యక్తినే పదవీచ్యుతుడ్ని చేసిన రామోజీరావు పోరాటంలో వారి సహకారం మరువలేనిది.

మార్గదర్శిపై పోరాటం బేతాళ విక్రమార్క కథను తలపించేలా సాగుతోంది.హెచ్యూఎఫ్ ద్వారా డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ సరైన యంత్రాంగం లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ విచారణకు వచ్చింది.

డిపాజిట్ల వివరాలు వెల్లడించకుండా 17 ఏళ్ల పాటు మార్గదర్శి నిరాకరించింది.ఇటీవల సుప్రీంకోర్టు డిపాజిట్ల వివరాలివ్వాలని మార్గదర్శికి ఆదేశాలిచ్చింది.

మదుపరుల సొమ్మును అక్రమంగా తమ వద్ద ఉంచుకోవడం చట్టవ్యతిరేకం కాబట్టి, ఇది తప్పు అని చెబుతున్నాం.నలభై ఏళ్లుగా ఇదే చేస్తున్నా అంటూ రామోజీరావు అసంబద్ధమైన వాదన వినిపిస్తూ వచ్చారు.

ఈనాడు కథనాలతో కోఆపరేటివ్ బ్యాంకులను మూతపడేలా చేశారు.నాపై మార్గదర్శి చేత 50 లక్షల రూపాయలకు పరువునష్టం ద్వారా వేశారు.

మార్గదర్శికి రామోజీరావుతో సంబంధం లేదని అబద్ధాలు చెప్తుంటే అదేమని అడిగినవాళ్లు లేరు.టీడీపీ ప్రభత్వ అక్రమాలు ఈనాడుకు కనబడవు.రాష్ట్ర పునర్విభజన చట్టంపై కేసు వేస్తే, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అఫిడవిట్ వేయలేదు.అఫిడవిట్ వేయకపోతే జగన్ కు, చంద్రబాబుకు తేడా ఉండదని మార్గదర్శి అంశంపై ప్రభుత్వం తరపున అఫిడవిట్ వేశారు.

మార్గదర్శిలో తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా అఫిడవిట్ వేస్తుందనే భయంతో తెలంగాణ ప్రభుత్వంపై, అక్కడి నూతన సచివాలయంపై ఈనాడులో పొగడ్తలు కురిపిస్తున్నారు.చట్ట ముందు అందరూ సమానమే అనేది పచ్చి అబద్ధం.

డబ్బులున్న వాళ్లకి చట్టం చుట్టంగా మారింది.రామోజీరావు దర్జాగా పడుకుంటే సీఐడీ వాళ్లు వెళ్లి స్టేట్మెంట్లు రాసుకోవాల్సివచ్చింది.

టీడీపీ, జనసేనలు మార్గదర్శికి, రామోజీరావుకు అనుకూలంగా స్టేట్మెంట్లిచ్చాయి.దురదృష్టవశాత్తు ఈనాడు గొప్ప పత్రికగా పేరొందింది.

ఎన్నికల సమయంలో కూడా ఈనాడు అత్యంత సంకుచితంగా వ్యవహరించింది.రామోజీరావు అన్నింటికీ అతీతుడనే అంశాన్ని అరికట్టకపోతే, ప్రజల్లోకి తప్పుడు భావన వెళ్తుంది.తప్పు చేశామని ఒప్పుకుని, జరిమానా కడితే సరిపోతుందని చెప్తున్నా.ఎంత దుష్ప్రచారం చేసినా జరగాల్సింది జరిగితీరుతుంది.

ప్రముఖ స్థానంలో వున్న రామోజీరావు లాంటి వాళ్లు చేసిన పొరపాట్లను ఒప్పుకుంటే ఆదర్శవంతంగా ఉంటుంది.నేను ఆరోపణలు చేసిన తర్వాత కూడా, మార్గదర్శికి డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయని వాళ్లే ప్రచారం చేసుకున్నారు.

డిపాజిట్లు తిరిగివ్వకపోతే ఫిర్యాదు చేస్తారు కదా అంటున్నారు.నేను కంప్లైంట్ చేస్తే నువ్వు వైఎస్సార్ మనిషివని ఆరోపిస్తున్నారు.

సంబంధం లేని ఎర్రంనాయుడు లాంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే జగన్ ఫై కేసులు పెట్టి నిర్బంధింధిస్తే, తనపై కేసులు పెట్టడానికి నేనెవరిని ప్రశ్నిస్తారు.

చంద్రబాబు, రామోజీల క్విడ్ ప్రోకో వుంది కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటారు.

అయితే, చార్టెడ్ అకౌంటెంట్లు సైతం రామోజీరావుకు అనుకూలంగా సమావేశాలు నిర్వహించుకోవడం దారుణం.తెలుగుదేశం పార్టీ తరపున గానీ, ఏ ఇతర పార్టీ తరపున గానీ అధికార ప్రతినిధులుగా ఎవరిని పంపినా నా దగ్గర కొన్ని ప్రశ్బాలున్నాయి.

పోలవరం నిర్మాణ బాధ్యతలు మీరు అడిగి తీసుకుకున్నారా.వాళ్ళిస్తే తీసుకున్నారా?రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి ప్రశ్నలపై చర్చించేందుకు ఎప్పుడు ఎప్పడికి రమ్మన్నా చర్చకు సిద్ధం.హెచ్యూఎఫ్ అంటే నాలుగు తరాలుగా వున్న ఆస్తికి సంబంధించిందని ఇటీవలే ఓ ఆడిటర్ చెప్పారు.కేసు వాదనలు ప్రారంభమైతే నిజానిజాలు వెల్లడవుతాయి.

చిట్ ఫండ్ వ్యాపారం చేస్తూ తాను కంపెనీ యాక్ట్ ప్రకారం తమ కంపెనీ పనిచేస్తుందని చెప్పడం విడ్డూరం.నాకెటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు.

ఏపీ పునర్విభజన విషయంలో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ వేయడం నాకు బలాన్నిచ్చింది.కొన్నాళ్లు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయదల్చుకోలేదు.

ఎందుకు విమర్శలు చేయవని విమర్శించేవారికి ఆ అర్హత లేదు.వైఎస్సార్ పేరుతో పార్టీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈ కేసును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వుంది.

జగన్ ఈ విషయంలో ఇదే వేగాన్ని కొనసాగిస్తూ హేతుబద్ధమైన ముగింపును తీసుకురావాలి.ప్రముఖ న్యాయవాది ఎస్.సత్యనారాయణ, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకుడు కె.బి.జి.తిలక్ ప్రసంగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube