నల్లగొండ జిల్లా:దేవరకొండ పట్టణంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దేవరకొండ పట్టణంలోని సంజయ్ కాలనీలో గల పీర్లబావిలో ఆదివారం మధ్యాహ్నం మేళ్ల జ్యోతి (14)మరికొంతమంది పిల్లలతో కలిసి ఈత కొడుతున్న సమయంలో నాగరాజు(25) కూడా ఈత కొట్టేందుకు బావిలో దిగాడు.
ఈత కొడుతున్న జ్యోతిని కాలు పట్టి నీటిలోకి తీసుకెళ్లడంతో జ్యోతితో పాటు లాక్కెళ్ళిన నాగరాజు నీటిలో మునిగి పోయారు.గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వారిద్దరినీ బయటికి తీసి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
మృతులు జ్యోతి ఎనిమిదో తరగతి చదువుతుండగా నాగరాజు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు.మృతురాలు తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు