ప్రభాస్ అంటే పిచ్చి అభిమానం.. ఈ క్రేజీ ఫ్యాన్ ఏం చేశాడంటే?

స్టార్ హీరో ప్రభాస్ ను చిన్నపిల్లలు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారనే విషయం తెలిసిందే.అయితే హీరోలపై ఉండే అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటూ ఉంటారు.

 Adipurush Dop Karthik Palani Huge Fan Of Prabhas Details, Adipurush, Crazy Fan,-TeluguStop.com

సెలబ్రిటీల ఫ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతూ అభిమానులను మెప్పిస్తూ ఉంటాయి.అయితే ప్రభాస్ కు వీరాభిమాని అయిన ఒక వ్యక్తి ప్రభాస్ పై ఉండే అభిమానాన్ని కొత్తగా చాటుకున్నాడు.

ప్రభాస్ కు క్రేజీ ఫ్యాన్ అయిన ఒక వ్యక్తి ప్రభాస్ పేరు వచ్చే విధంగా హెయిర్ స్టెయిల్ ను చేయించుకోవడం గమనార్హం.ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ఆదిపురుష్ కు డీఓపీగా పని చేస్తున్న వ్యక్తి అయిన కార్తీక్ పలాని ఈ విధంగా అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రభాస్ అంటే భారీగా ఇష్టం ఉన్న కార్తీక్ పలానీ కొత్త హెయిర్ స్టైల్ తో ప్రభాస్ తో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

ఓం రౌత్ డైరెక్షన్ లో 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది ఆగష్టు నెలల్లో రిలీజ్ కానుంది.

Telugu Adipurush, Crazy Fan, Dop Karthik, Dop Adipurush, Fan Prabhas, Karthik Pa

2022 ఆగష్టు 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటన చేయడం గమనార్హం.పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఒకే సమయంలో ఎక్కువ సినిమాలలో నటిస్తూ ప్రభాస్ పై ఉండే అభిమానాన్ని చాటుకుంటున్నారు.ప్రభాస్ కొత్త సినిమాల కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ నుంచి ప్రభాస్ మాత్రమే ఏకైక పాన్ ఇండియా స్టార్ కాగా ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు కూడా ఇదే స్థాయిలో క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube