అందరి నోటా ఒకటే మాట...విన్నర్ ఎవరో ముందే చెప్పేస్తున్నా ప్రేక్షకులు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 స్టార్ట్ అయ్యి రెండు వారాలు గడవక ముందే సీజన్ విన్నర్ ఎవరు అంటూ ఇప్పటికే ఒక రసవత్తరమైన చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో.

ప్రతిసారి కూడా కంటెస్టెంట్ ఆట తీరును గమనించి ఎవరు విజేతలు అవుతారు, ఎవరు టాప్ ఫైవ్ కి వెళ్తారు అనేది ముందుగానే ఒక అవగాహనకు వస్తారు ప్రేక్షకులు అలాగే ఈసారి కూడా ఆకాశ తొందరగానే ఒక క్లారిటీ వచ్చేసింది అందరికీ.

ఈసారి కచ్చితంగా టాప్ ఫినాలే లో ఎవరు ఉంటారో చెప్పకపోయినా ఖచ్చితంగా విన్నర్ ఎవరో అనేది మాత్రం ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.ఎంతో చక్కగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కేవలం ఆడుతుంది ఒకరిద్దరూ మాత్రమే.

అందుకే విన్నర్ ఎవరో కూడా ముందుగానే ఊహించేస్తున్నారు.అయితే అందరిని నోళ్ళలో ప్రస్తుతం నానుతున్న పేరు గీతు రాయల్.

కేవలం రెండు వారాల్లోనే గీతు పేరు ఎక్కువగా వినిపించడానికి కారణాలు లేకపోలేదు.ఇంట్లో ఉన్న మిగతా సభ్యులకు ఆడాలన్న ఉత్సాహం లేకపోవడమే గీతు పేరు ఎక్కువగా వినిపించడానికి గల ముఖ్యమైన కారణం.

Advertisement

ఇక గతవారం జరిగిన సిసింద్రీ ఎపిసోడ్ లో కూడా గీతు తన ప్రదర్శనతో టాప్ లేపేసింది అనే చెప్పాలి.ఆమె ఆడుతున్న విధానానికి, ఆమె యాస, భాషతో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం కూడా ఆమెకు మరొక అడ్వాంటేజ్ అని చెప్పక తప్పదు.

ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే గీతు అంటే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.బయట ఎaలా ఉంటామో ఇంట్లో కూడా అలాగే ఉండాలనే గీతు సిద్ధాంతం కూడా అందరికీ నచ్చినట్టుగా కనిపిస్తుంది.

అంతేకాదు మొదటి వారంలో ఖచ్చితం గా ఎలిమినేషన్ అవుతుంది అనుకున్న గీతు రెండో వారానికి బెస్ట్ పెర్ఫార్మర్ గా సాగడానికి ఆమెను ఆమె మలుచుకున్న విధానం కూడా ఒక కారణం కావచ్చు.అయితే కేవలం రెండు వారాల ఆటతో గీతుని ఫైనల్ కంటెస్టెంట్ అనడం కూడా కరెక్ట్ కాదని ఒక వర్గం ప్రేక్షకులు భావిస్తున్నారు ఎవరు విన్నర్ అయినా కూడా గీతు ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటుందనేది మరొక వాదన.మరి ఎవరు విన్నర్ అవుతారు ఎవరు ఫైనల్ కి వెళ్తారు అనేది మరి కొన్ని రోజులు వేచి చూస్తే కానీ తెలియదు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు