జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.రోజుకి రెండు మూడు సభలలో పాల్గొంటూ కూటమి అభ్యర్థులను బలపరుస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం హనుమాన్ జంక్షన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో చింతమనేని తనతో గొడవ పెట్టుకున్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు.అయినా గాని ప్రభాకర్( Chintamaneni Prabhakar) అంటే తనకి ఇష్టమైన నేత అని పవన్ స్పష్టం చేశారు.
దెందులూరులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేనే గెలిపిస్తా అని చింతమనేని చెప్పటం చాలా ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
గొడవ పెట్టుకున్న వారే మంచి స్నేహితులు అవుతారని, విడదీయలేని బంధం ఏర్పడుతుంది.చింతమనేనితో గొడవ అందంగా ఉంటుంది.ప్రేమ ఉన్నచోటే గొడవ ఉంటుందంటూ అక్కడ ఉన్న వారిని పవన్ తన ప్రసంగంతో ఉత్సాహపరిచారు.2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల ప్రచారంలో చింతమనేని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఆ సమయంలో చింతమనేని సైతం జనసేన పార్టీపై విమర్శలు చేయడం జరిగింది.
కానీ 2019 ఎన్నికలలో టీడీపీ( TDP ) ఓటమి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.ఈసారి ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ( TDP, Janasena, BJPమూడు కలిసి పోటీ చేస్తూ ఉండటంతో.
ఈ ఇద్దరి నేతల మధ్య సఖ్యత ఏర్పడింది.దీంతో హనుమాన్ జంక్షన్ లో ఎన్నికల ప్రచారంలో చింతమనేని ప్రభాకర్ నీ దగ్గరకు తీసుకుని మరి పవన్ ప్రసంగించారు.