హైదరాబాదులో కోట్లు విలువచేసే ప్రాపర్టీ కొన్న నయనతార?

దక్షిణాది సిని ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈ హీరోయిన్ కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.

 Nayanthara Bought Properties Worth Crores In Hyderabad,nayanthara,hyderabad,remu-TeluguStop.com

సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా చలామణి అవుతున్నటువంటి ఈమె గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీగానే ఆస్తులు సంపాదించారని తెలుస్తుంది.

ఇక తాజాగా ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

తాజాగా ఈమె తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక తాజాగా ఈమె ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది.

ఇక నయనతార భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ చెన్నైలోనూ హైదరాబాద్ లోని విలువైన ప్రాపర్టీ కొనుగోలు చేసిందని తెలుస్తోంది.చెన్నైలో ఖరీదైన భవనాలతో పాటు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఏరియాలో రెండు ఖరీదైన భవనాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Telugu Atlee, Chennai, Hyderabad, Jawaan, Nayanthara, Shah Rukh Khan, Vignesh Sh

ఇలా హైదరాబాదులో కొనుగోలు చేసిన ఒక్కో ఫ్లాట్ సుమారు 15 కోట్ల వరకు విలువ చేస్తున్నట్లు సమాచారం.ఇక చెన్నైలో కూడా అన్ని వసతులతో కూడిన ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇలా భారీగా ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా నయనతారకు ప్రత్యేకంగా ఒక జెట్ ఫ్లైట్ కూడా ఉందని తెలుస్తోంది.అయితే ఈమె సినిమాలలో సంపాదించినది మొత్తం ఇలా ఆస్తులను కొనుగోలు చేయడమే కాకుండా బిజినెస్ లలో కూడా భారీ పెట్టుబడులను పెడుతూ బిజినెస్ వైపు కూడా మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్తులో నయనతార సినిమాలకు దూరమైనప్పటికీ వ్యాపార రంగంలో కొనసాగాలన్న ఉద్దేశంతోనే ఈమె భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube