విజయవాడలో మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో..!!

విజయవాడలో మోదీ, చంద్రబాబు, ( Chandrababu )పవన్ రోడ్ షో ప్రారంభమైంది.అంతకముందు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్ పొర్టుకు చేరుకున్నారు.

 Modi Chandrababu Pawan Road Show In Vijayawada Modi, Chandrababu, Pawan Kalyan ,-TeluguStop.com

కూటమిలోని పార్టీలకు చెందిన 14 మంది ప్రతినిధులు మోదీకి స్వాగతం పలికారు.రోడ్డు మార్గంలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు బయల్దేరిన ఆయన.అనంతరం రోడ్ షోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు.పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు 1.8 కి.మీ పాటు రోడ్ షోలో ముగ్గురు నేతలు పాల్గొన్నారు.ఏపీలో ఈసారి ఎన్నికలలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు( BJP Janasena TDP parties) మూడు కలిసి పోటీ చేస్తున్నాయి.2014 ఎన్నికలలో ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేయగా విజయం సాధించటం జరిగింది.

దీంతో 2024 ఎన్నికలలో కూడా ఆ రీతిగానే విజయం సాధించాలని కూటమి నేతలు భావిస్తున్నారు.ఈ క్రమంలో ప్రచారానికి చివరివారం రావటంతో చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు.సోమవారం రాజమహేంద్రవరం, అనకాపల్లి పార్లమెంట్ ప్రాంతాలలో కూటమి బహిరంగ సభలు నిర్వహించింది.ఈ సభలలో వైసీపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ( Narendra Modi)సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

కాగా బుధవారం పీలేరు నియోజకవర్గము కలికిరిలో కూటమి సభ నిర్వహించడం జరిగింది.అనంతరం సాయంత్రం విజయవాడలో భారీ రోడ్ షో నిర్వహించారు.పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు సాగిన ఈ రోడ్ షోకు జనం పోటెత్తారు.టీడీపీ, జనసేన( Janasena ), బీజేపీ శ్రేణులతో పాటు విజయవాడ జనం భారీగా తరలిరావడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube