కొన్నిరోజుల క్రితం స్టార్ హీరో సూర్య కొడుకు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడం ద్వారా తల్లీదండ్రులకు ఎంతో సంతోషాన్ని కలిగించిన సంగతి తెలిసిందే.ఈ సంఘటనను మరవక ముందు సూర్య కూతురు దియా 12వ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు ఏకంగా 581 మార్కులు సాధించి వార్తల్లో నిలిచారు.
గతంలో కూడా పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన దియా ఇప్పుడు కూడా పరీక్షలలో సత్తా చాటడం గమనార్హం.
ముంబైలోని పాపులర్ స్కూల్స్ లో ఒకటైన ధీరూబాయ్ అంబానీ స్కూల్ లో దియా( Diya ) చదువుకుంటున్నారని భోగట్టా.ఫిజిక్స్ లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు సాధించిన దియా ఇంగ్లీష్ లో 96, అకౌంట్స్ లో 94 మరో సబ్జెక్ట్ లో 96 మార్కులు సాధించినట్టు తెలుస్తోంది.దియాకు మంచి మార్కులు రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని సమాచారం అందుతోంది.
సూర్య పిల్లలు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సూర్య పిల్లల కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.భవిష్యత్తులో సూర్య పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారో లేదో తెలియాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సూర్య( Suriya ) ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నారు.
కంగువ సినిమా( Kanguva ) ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా సూర్య ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది.కంగువ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కంగువ మూవీలో యాక్షన్ సీన్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని భోగట్టా.సూర్య కంగువాతో భారీ హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.కంగువా సినిమా ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.