విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పుల విభజన కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.షెడ్యూల్ 9, 10 లో ఉన్న సుమారు 1.4 లక్షల కోట్ల ఆస్తుల విభజన జరగలేదని ఏపీ పిటిషన్ ల పేర్కొంది.ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
అనంతరం తదుపరి విచారణను జూలై నెలాఖరుకి వాయిదా వేసింది.







