వైరల్: 'ధూమ్‌' స్టైల్‌లో దొంగతనం ప్లాన్ చేశాడు... కట్ చేస్తే?

సినిమాలు జనాలమీద ఏరకంగా ప్రభావం చూపుతాయో అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో కొంతమంది ప్రేమించడం మొదలు పెడితే మరికొంతమంది దొంగతనాలు( Robbery ) చేస్తూ వుంటారు.

 Thief In Poland Poses As Mannequin Before Stealing Jewellery From Mall Arrested-TeluguStop.com

ఇక బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గురించి అందరికీ తెలిసే వుంటుంది.ఆయన నటించిన సినిమా ‘ధూమ్‌’ని( Dhoom ) ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు.

ఎందుకంటే ఆ సినిమాలో హృతిక్( Hrithik Roshan ) చేసిన దొంగతనాలకు సంబందించిన సన్నివేశాలు నేటికీ చాలా క్రేజీగా అనిపిస్తాయి.అతనికి కూడా అలాగే అనిపించి, ధూమ్ స్టైల్‌లో దొంగతనం చేద్దామని ప్లాన్ చేశాడు.

అవును, అచ్చం ధూమ్(Dhoom) సినిమాలో హృతిక్ రోషన్ చేసినట్లు చేద్దామని యత్నించాడు.దాంతో ఈ దొంగతనం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ తంతు పోలాండ్‌లోని( Poland ) వార్సాలో జరిగింది.ఇక్కడ ఓ దొంగ దిష్టిబొమ్మగా మారి( Mannequin ) ఓ దుకాణానికి వెళ్లి అక్కడ గంటల తరబడి బొమ్మలా నిలబడి ఉన్నాడు.

ఆ తర్వాత తన పని షురూ చేశాడు.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతని దగ్గర నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డుకి కూడా అతనిపై చిన్న అనుమానం రాకపోవడం ఇపుడు చర్చనీయాంశమైంది.

వార్సా పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్‌ లో షేర్ చేసిన సదరు వీడియోలో, దొంగ నిశ్శబ్దంగా నిలబడి వుండడం మనం గమనించవచ్చు.ఆ తర్వాత బట్టలు మార్చుకునేందుకు ఓ స్టాల్‌కి వెళ్లి అక్కడ భోజనం కూడా చేశాడు.అది గమనించిన పోలీసులు అతడిని పట్టుకున్నారు.ఈ క్రమంలో ఈ దొంగ పోలీసుల చేతికి చిక్కాడు.తరువాత అతగాడిని కోర్టులో హాజరుపరచగా మూడు నెలల రిమాండ్‌ విధించి జైలుకు తరలించారు.ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, ఇలాంటి దొంగతనాలు ఎన్నో చేశానని ఆ వ్యక్తి పోలీసులకు చెప్పగా వారు షాక్ అయ్యారు.అవును, ఇపుడు నెటిజనం కూడా షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube