ఆ లక్షణాలున్న అబ్బాయే మొగుడిగా కావాలన్న అశ్విని శ్రీ.. అందం ముఖ్యం కాదంటూ?

అశ్విని ( Aswini )పరిచయం అవసరం లేని పేరు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి అశ్విని ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి రాకముందు పలు సినిమాలలో నటించారు.

 Latest News About Bigg Boss Aswini Sree, Bigg Boss, Aswini Sreeaswini Sree, Husb-TeluguStop.com

కానీ పెద్దగా ఎవరికి తెలియదు.ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చిన తర్వాత ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో ఈమె ఇన్ని సినిమాలలో చేసిందా అన్న ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇలా వెండితెరపై పలు సినిమాలలో నటించిన అశ్విని బిగ్ బాస్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

ఈమె వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టారు.దాదాపు ఆరు వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి ఈమె అనంతరం ఎలిమినేట్ అయ్యారు.ఎలిమినేట్ అయిన తర్వాత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ అశ్విని సందడి చేస్తున్నారు.

అదేవిధంగా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి స్పెషల్ ఈవెంట్స్ లో కూడా ఈమె పాల్గొంటున్నారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అశ్వినికి యాంకర్ నుంచి ఒక ప్రశ్న ఎదురైంది.

మీకు ఎలాంటి అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటున్నారనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు అశ్విని సమాధానం చెబుతూ నేను పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి చాలా మంచి మనసున్న అబ్బాయి అయితే చాలు అబ్బాయి దగ్గర డబ్బులు లేకపోయినా చూడటానికి చెండాలంగా ఉన్న నల్లగా ఉన్న నేను అవన్నీ ఏమీ పట్టించుకోను నన్ను బాగా చూసుకోవాలి.అతనికి మంచి మనసు ఉండాలని ఈమె తెలిపారు.నాకు డబ్బు ఉండాలని ఆశలు కూడా లేవు అంటూ ఈమె తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా తెలిపారు.

ఈమె ఒకేసారి ఇన్ని క్వాలిటీస్ చెప్పడంతో యాంకర్స్ ఇప్పటికీ మీరు సింగిల్ గానే ఉన్నారా అంటూ ప్రశ్న వేయడంతో మన వెంట ఎంతో మంది పడుతుంటారు కానీ మనకు కూడా అబ్బాయిలలో కొన్ని క్యారెక్టర్స్ నచ్చాలి కదా అంటూ అశ్విని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

https://www.facebook.com/watch/?v=256351244139041&ref=sharing
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube