అనుకున్నదే అవుతుందా.. ల్యాండ్ అయ్యేది భీమ్లా నాయకేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం పవన్ అభిమానులే కాకండా యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ‘వకీల్ సాబ్’గా వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్న పవన్, ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళ చిత్రం ‘అయ్యప్పన్నుమ్ కొషియుమ్’ను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Rana Movie To Be Titled Bheemla Nayak, Pawan Kalyan, Rana Daggubati-TeluguStop.com

ఈ సినిమాలో పవన్ పర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమాకు సంబంధించి వరుసగా అప్‌డేట్స్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇప్పటికే కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో పవన్ చేయబోయే పాత్ర పేరును రివీల్ చేసింది.ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు.

అయితే తాజాగా లుంగీ లుక్‌లో కూడా పవన్ కనిపించి అసలు ఆయన పాత్ర ఏమిటా అనే కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేశాడు.ఇక ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

దీంతో ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అనే విషయంపై ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.కాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ముందుగానే ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండనుండటంతో, ఆయన పాత్ర పేరైన ‘భీమ్లా నాయక్’నే ఈ సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారట చిత్ర యూనిట్.మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమాలో మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube