ఒకప్పుడు జబర్దస్త్ రేటింగ్ 18.. ఇప్పుడు రేటింగ్‌పై అప్పారావు కామెంట్స్!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో నెంబర్ వన్ కామెడీ షో గా గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ షో ఇదివరకు టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లేది.

 Jabardasth Senior Most Comedian Apparao About Jabardasth Downfall Ratin Jabarda-TeluguStop.com

కానీ క్రమక్రమంగా జబర్దస్త్ షో టి ఆర్ పి రేటింగ్ పూర్తిగా తగ్గిపోతోంది.ఈ జబర్దస్త్ స్టేట్ ద్వారా ఎంతో మంది కమెడియన్ లు వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే.

కాగా ఈమధ్య ఒక్కొక్క కమెడియన్ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నారు.అలాంటి వారిలో సీనియర్ మోస్ట్ కమెడియన్ అప్పారావు కూడా ఒకరు.

తాజాగా అప్పారావు జబర్దస్త్ రేటింగ్ విషయంలో పలు వ్యాఖ్యలు చేశారు.జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది కమెడియన్లు ప్రస్తుతం భారీ స్థాయిలో పారితోషికం అందుకుంటూ దూసుకుపోతున్నారు.

అయితే మొదట 2013లో మొదలైన జబర్దస్త్ షో ఊహించిన విధంగా మంచి పాపులారిటీ సంపాదించుకొని 2014 నుంచి నాన్ స్టాప్ గా షో నిర్వాహకులకు రేటింగ్స్ తెచ్చి పెట్టడంతో పాటు కాసుల వర్షం కురిపించింది.అలా నిదానంగా జబర్దస్త్ షోకి పలువురు సినిమా యాక్టర్స్ కూడా రావడం మొదలయింది.

కాగా జబర్దస్త్ షోలో చిన్న చిన్న కమెడియన్లకు కూడా ఒక్కొక్క ఎపిసోడ్ కి పదివేలకు పైగా పారితోషికం ఇచ్చారు.అయితే ఒకప్పుడు పదివేలు అందుకున్న కొందరు ఆర్టిస్టులు ప్రస్తుతం టీం లీడర్లుగా మారి ఒక్కొక్క ఎపిసోడ్ కి రెండు లక్షల పైగానే పారితోషకం అందుకుంటున్నారు.

Telugu Appa Rao, Jabardasth, Downfall-Movie

అయితే టిఆర్పి రేటింగ్స్ భారీ స్థాయిలో అందుకుంటూ వస్తున్న ఈ షో కి మధ్యలో ఒక్కసారిగా డల్ అయిపోయింది.అందుకు తగ్గట్టుగా జబర్దస్త్ నుంచి ఒక్కొక్క కమెడియన్ వెళ్ళిపోతూ ఉండడంతో టిఆర్పి రేటింగ్ మరింత తగ్గిపోయింది.ఇది ఇదివరకు కనిపించిన జోరు ప్రస్తుతం జబర్దస్త్ లో కనిపించడం లేదు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అప్పారావు మాట్లాడుతూ జబర్దస్త్ షో నుంచి తాను అసంతృప్తి గానే బయటికి వచ్చినట్లు తెలిపారు.

తాను బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు కనీసం షో నిర్వాహకులు ఒక్క మాట కూడా అడగలేదని, సీనియర్ కమెడియన్ అన్న గౌరవం కూడా చూపించలేదు అని తెలిపారు అప్పారావు.అయితే ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కష్టపడి టిఆర్పి రేటింగ్స్ పోషించడంలో ముఖ్యపాత్రను పోషించారని అలా ఇదివరకు 18 టిఆర్పి రేటింగ్ వచ్చేది అని కానీ ప్రస్తుతం నాలుగు నుంచి ఆరు రేటింగ్స్ కు పడిపోయినట్లు అప్పారావు తెలిపారు.

అయితే జబర్దస్త్ లో కొంత మంది దారుణమైన ప్రవర్తన కారణంగానే అక్కడి నుంచి చాలామంది కమెడియన్స్ వెళ్లిపోతున్నట్లు అప్పారావు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube