బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎంతో అట్టహాసంగా ఆదివారం ప్రారంభమైంది.గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం కంటెస్టెంట్స్ అందరికీ స్వాగతం చెబుతూ హౌస్ లోపలికి పంపించారు.అయితే గతంలో ఏ సీజన్ లో లేని విధంగా ఐదవ సీజన్ లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లను పంపించడంతో ఈ సీజన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో సందడి చేయనుందో అర్థమవుతోంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వారందరికీ స్టార్ మా స్వాగతం పలుకుతూ ట్విట్టర్ పేజీలో అందరి ఫోటోలను షేర్ చేశారు.ఈ విధంగా స్టార్ మా 19మంది కంటెస్టెంట్ లను ట్విట్టర్ పేజ్ లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి అధిక సంఖ్యలో లైక్, షేర్స్, కామెంట్స్ పొందిన కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ట్ షణ్ముఖ్ జస్వంత్ ఉండటం గమనార్హం.
మిగిలిన ఏ కంటెస్టెంట్ కు లేనంత సపోర్ట్ అతనికి ఉండటంతో అతని స్టామినా ఏంటో ఈ విధంగా నిరూపితమయింది.
ఐదవ సీజన్ లో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్ లో షణ్ముఖ్ జస్వంత్,బుల్లితెర యాంకర్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ రవి మధ్య టైటిల్ పోరు ఉంటుందని చాలా మంది భావించారు.కానీ స్టార్ మా ట్విట్టర్ పేజ్ ద్వారా యాంకర్ రవి కంటే షణ్ముఖ్ జస్వంత్ కి ఎక్కువ మద్దతు ఉండడంతో యాంకర్ రవికి ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.ఇక ఈ సీజన్లో తొమ్మిది మంది మహిళలు ఉండగా స్టార్ మా ట్విట్టర్ ద్వారా ఎక్కువ మంది ఫాలోయింగ్ పెంచుకున్న లేడి కంటెస్టెంట్ గా సిరి హనుమంత్ మొదటి స్థానంలో ఉన్నారు.