చనిపోయిన చెల్లి పేరును కొంచెం మార్చి కూతురికి పెట్టుకున్న విజయ్.. ఈ విషయాలు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు అభిమానుల దగ్గర సరైన సమాధానం లేదు.అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం నంబర్ వన్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది విజయ్( Vijay ) పేరు సమాధానంగా చెబుతారు.

 Vijay Sister Vidya Photo Goes Viral In Social Media Details, Vijay, Thalapathy V-TeluguStop.com

విజయ్ సినిమాల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించగా రాజకీయాల్లో మాత్రం అంచెలంచెలుగా ఎదిగి ప్రశంసలు అందుకున్నారు.అయితే విజయ్ చెల్లి( Vijay Sister ) గురించి మాత్రం చాలామంది అభిమానులకు తెలియదు.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా విజయ్ చెల్లెలి ఫోటో ట్రెండింగ్ అవుతోంది.గత కొన్ని రోజులుగా విజయ్ చెల్లెలి ఫోటోలను అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

విజయ్ సోదరి పేరు విద్య( Vidya ) కాగా ఆమె మరణించి 40 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆమె ఫోటోను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.విద్య పుట్టిన నాలుగేళ్లకే అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.

Telugu Divya, Goat, Kollywood, Leo, Vidya, Vijay, Vijay Divya, Vijay Sister-Movi

చెల్లి మరణించిన సమయంలో విజయ్ చాలా కృంగిపోయాడట.చెల్లి చనిపోయిన సమయంలో విజయ్ ఒకలాంటి డిప్రెషన్ లోకి వెళ్లారని సమాచారం అందుతోంది.అయితే విజయ్ తన కూతురికి చెల్లెలి పేరును కొంచెం మార్చి దివ్య( Divya ) అని పెట్టుకున్నారు.విజయ్ కూతురు దివ్య బ్యాడ్మింటన్ లో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

విజయ్ ప్రస్తుతం గోట్( GOAT Movie ) అనే సినిమాలో నటిస్తున్నారు.

Telugu Divya, Goat, Kollywood, Leo, Vidya, Vijay, Vijay Divya, Vijay Sister-Movi

వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ ఏడాదే ఈ సినిమా విడుదలవుతుందేమో చూడాలి.లియో సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న విజయ్ వెంకట్ ప్రభు సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.విజయ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.

విజయ్ కెరీర్ పరంగా మరెన్నో విజయాలను సొంతం చేసుకొని బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube