దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి అందరికీ ఎంతో సుపరిచితమే.నయనతార ప్రస్తుతం విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే వీరి వివాహం జరిగిన మరుక్షణం నుంచి ఏదో ఒక వివాదం ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.వివాహం జరిగిన వెంటనే తిరుమల ఆలయానికి వెళ్ళగా అక్కడ చెప్పుల వివాదం చోటుచేసుకుంది.
తాజాగా ఈ దంపతులు సరోగసి విషయంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.
వీరిద్దరూ సరోగసి చట్ట నిబంధనలను ఉల్లంఘించి పిల్లలకు జన్మనిచ్చారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా వీరిపై చర్యలకు ఆదేశించింది.
ఈ క్రమంలోనే ఆరు సంవత్సరాల క్రితమే వీరిద్దరూ వివాహం చేసుకున్నారని అలాగే ఏడాది క్రితం సరోగసికి ప్లాన్ చేసినట్టు అన్ని ఆధారాలను సమర్పించడంతో ఈ వివాదం నుంచి ఉపశమనం పొందారు.అయితే వీరి సరోగసి విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో విగ్నేష్ ఎప్పటికప్పుడు ఈ వార్తలపై స్పందిస్తూ పరోక్షంగా ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

ఓపికతో ఎదురు చూస్తే మనసుకు ప్రశాంతత ఉంటుందని తప్పుడు వార్తలు వ్యాపించినంత తొందరగా నిజాలు ప్రచారం కావంటూ ఈయన పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.పూర్తిగా ఉపశమనం పొందిన విగ్నేష్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నయనతార పాస్ పోర్ట్ సైజ్ ఫోటోని షేర్ చేస్తూ.మెరిసే అందం ఆమె అంటూ నయనతార గురించి ఎంతో గొప్పగా అభివర్ణించారు.ప్రస్తుతం విగ్నేష్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ జంట 2015వ సంవత్సరంలో నానుమ్ రౌడీ థాన్ లో సినిమాలో కలిసి పనిచేశారు.ఇలా ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి నేడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.