ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ ...!

వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో ధోనీ ఉంటాడో లేదోన‌ని ఆందోళ‌న చెందుతున్న అభిమానుల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ ధోనీ ఆడతాడని కన్ఫామ్ చేశారు.

 Good News For Dhoni Fans Dhoni, Fans, Good News, Ipl, Csk, Ms Dhoni,sports Updat-TeluguStop.com

తాము ఉప‌యోగించ‌బోయే తొలి రిటెన్ష‌న్ కార్డు ధోనీ కోస‌మే అని సీఎస్కే అధికారి ఒక‌రు అధికారికంగా ప్ర‌క‌టించారు.రిటెన్ష‌న్ క‌చ్చితంగా ఉంటుంది.

అయితే ఎన్ని రిటెన్ష‌న్లు ఉంటాయ‌న్న‌దానిపై మాకు స్ప‌ష్ట‌త లేదు.కానీ తొలి రిటెన్ష‌న్ అత‌ని కోస‌మే.

అత‌డు క‌చ్చితంగా వ‌చ్చే ఏడాది ఆడ‌తాడు అని సి.ఎస్.కె టీమ్ లోని ఓ అధికారి.

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి మూడు సీజన్లుగా ప్రచారం జరుగుతోంది.

ఐపీఎల్ 2020 సీజన్‌కి ముందే ఎమ్మెస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంతో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ మాహీ రిటైర్ అవుతాడని ప్రచారం జరిగింది.ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచిన సీఎస్‌కే, 2021 సీజన్‌లో టైటిల్ గెలిచి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది.

ఇక 2023 ఐపీఎల్ సీజన్ లోనూ ధోనీ ఆడతాడని తెలియడంతో మహీ ఫ్యాన్స్, సీఎస్కే ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.వచ్చే సీజన్ కచ్చితంగా ఆడతానని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ధోనీ క్లారిటీ ఇచ్చాడు.

అయితే చెన్నై వేదికగా మ్యాచ్‌లు ఆడకపోవడం అంతగా నచ్చడం లేదని ధోనీ పేర్కొన్నాడు.గత ఏడాది ఛాంపియన్ అయిన సీఎస్కే ఈ ఏడాది వరుస ఓటములతో అంతగా రాణించలేకపోయింది.

రవీంద్ర జడేజా నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక ధోనీ జట్టులో నూతనోత్సాహాన్ని నింపాడు.ఓడినా తాము మెరుగైన ప్రదర్శన చేశామని ఎంఎస్ ధోనీ గుర్తుచేశాడు.వచ్చే ఏడాది పరిస్థితులు అనుకూలిస్తే చెన్నై వేదికగా బరిలోకి దిగాలని తాను భావిస్తున్నట్లు తెలిపాడు ధోనీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube