పోలీసుల నిర్వాకంతో నవ్వుల‘పాలు’

దొంగతనాలకు పాల్పడే దొంగలను పట్టుకుని వారి భరతం పట్టే పోలీసులే తప్పు దారి పడితే ఎలా ఉంటుందో మనం చాలాసార్లు చూశాం.అయితే తాజాగా ఓ ఘటనలో పోలీసు దొంగతనానికి పాల్పడి ఖాకీల పరువు గంగలో కాదు పాలలో కలిపేశాడు.

 Policeman Caught On Cctv Stealing Milk Packets-TeluguStop.com

ఇంతకీ ఈ పోలీసు ఏం చోరీ చేశాడో తెలిస్తే మీరు అవాక్కవ్వడం ఖాయం.

ఢిల్లీ సమీపంలోని నోయిడాలో రాత్రిపూగ పేట్రోలింగ్ చేసే పోలీసులు చోరీకి పాల్పడ్డారు.

పేట్రోలింగ్ చేస్తు్న్న క్రమంలో ఓ దుకాణం ముందు పాల ప్యాకెట్ల ట్రేలు ఉండటంతో వాటిలో నుండి పాల ప్యాకెట్లను పోలీసు కానిస్టేబుల్ దొంగలించాడు.ఈ తతంగం సీసీటీవీలో రికార్డు కావడంతో మనోడి బండారం బయటపడింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

పాల ప్యాకెట్లు దొంగలించిన కానిస్టేబుల్‌ను గుర్తించి, అతడిపై తగు చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసుల పరువు తీశాడంటూ ఆ కానిస్టేబుల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube