ఐపీఎల్ మొదలైందంటే క్రికెట్ అభిమానుల్లో సందడే సందడి.అంతర్జాతీయ స్థాయిలో ఆడే క్రికెటర్లు, వివిధ జట్టులలో చేరి ప్రత్యర్థులు సహచరులుగా మారిపోయి కలిసి విజయం కోసం పోరాడడంలో ఉండే మజా మరొక దానిలో ఉండదు.
ఈ 2023లో జరిగే ఐపీఎల్ చాలా స్పెషల్.ప్రతి జట్టు లోనూ కెప్టెన్లతో సహా పెను మార్పులు జరిగాయి.
దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ 2022 డిసెంబర్ నెలలో పూర్తయింది.ఇక 2023 ఐపీఎల్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మార్చి 31వ తేదీన ఐపీఎల్ ప్రారంభం అవుతుండగా మాజీ ఆటగాళ్లు, మాజీ అధ్యక్షులు సైతం స్పందించి పలు రకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇక క్రికెట్ నిపుణులు రివ్యూ చేయడం కూడా మొదలు పెట్టారు.
అంతర్జాతీయ ఆటగాళ్లందరూ ఐపీఎల్ లో వివిధ జట్లలో చేరి అద్భుత ఆటను ప్రదర్శిస్తుంటే చూడడానికి రెండు కళ్ళు కూడా చాలవు.కాబట్టి ఐపీఎల్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ కూడా త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో, ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఐపీఎల్ ద్వారా యువ ఆటగాళ్లు, పెద్ద స్టార్ ఆటగాళ్లుగా రాణిస్తారని తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.సూర్య కుమార్ యాదవ్ న్యూ స్పెషల్ కేటగిరీగా పరిగణిస్తూ.శుబ్ మన్ గీల్, రిషబ్ పంత్, పృద్విష, ఉమ్రాన్ మాలిక్, రుతురాజు గైక్వాడ్ ల పేర్లను సూచించాడు.కానీ ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల పేర్లను గంగూలీ పరిగణలోకి తీసుకోకపోవడం క్రికెట్ ప్రేక్షకులకు ఆశ్చర్యానికి గురి చేసింది.