2000 సంవత్సరం లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తేజ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం సినిమా తో ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు ఆ తర్వాత తేజ డైరెక్షన్ లోనే వచ్చిన నువ్వూ నేను జయం సినిమాలతో ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా తక్కువ టైం లోనే పేరు సంపాదించుకున్నాడు.ఆ తర్వాత నాగార్జున లాంటి పెద్ద హీరోల సినిమాలకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా చేసి తన సాంగ్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు.

అలాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఇండస్ట్రీ లో మ్యూజిక్ చేయకుండా ఎందుకు తన మ్యూజిక్ వదులుకోవాల్సి వచ్చిందంటే ఒక పెద్ద హీరో తనకు సంభందించిన ఒక హీరో ది మూవీ చేయాల్సి ఉండగా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్పీ పట్నాయక్ గారిని తీసుకుందాం అని ఈ పెద్ద హీరో డిసైడ్ అయి ఆర్పీ దగ్గరికి వెళ్తే అప్పటికే చేతిలో అరడజను సినిమాలతో బిజీగా ఉన్న ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇది నేను చేయలేను అని చెప్పాడట దానికి హర్ట్ అయిన ఆ పెద్ద హీరో ఆర్పీ పట్నాయక్ కి అవకాశాలు రాకుండా చేస్తున్నారు అనే టాక్ ఇండస్ట్రీ లో చాలా రోజుల పాటు వినిపించింది మంచి మ్యూజిక్ ఇచ్చినప్పటికీ ఆయనకి ఆఫర్స్ లేకపోవడం తో ఈయన కెరియర్ ని నాశనం చేయడం లో ఆ హీరో ప్రముఖ పాత్ర పోషించిన తెలుస్తుంది.ఆ స్టార్ హీరో అల్లుడి సినిమాకి మ్యూజిక్ చేయకపోవడమే ఆర్పీ పట్నాయక్ చేసుకున్న పాపం అని అందరూ అంటుంటారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ స్టార్ హీరో నటించిన 2 సినిమాలకి కూడా ఆయన మ్యూజిక్ ఇచ్చారు ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.దాంతో ఆర్పీ పట్నాయక్ సినిమాలు డైరెక్ట్ చేస్తూ మంచి సక్సెలు అందుకుంటున్నారు ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో దగ్గుబాటి అభిరామ్ హీరోగా వస్తున్న అహింస సినిమా కి మళ్ళీ మ్యూజిక్ అందుస్తు మన ముందుకు వస్తున్నారు ఆర్పీ పట్నాయక్ గారు చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్ లో తన మ్యూజిక్ తో ఏ మేరకు ప్రేక్షకులని అలరిస్తారో…








