ఓ వ్యక్తి తన భార్యకు( wife ) అక్రమ సంబంధం ఉందేమో అనే అనుమానం పెంచుకొని తరచూ వేధించేవాడు.దీంతో ఆ ఇంట్లో మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది.
తన తల్లి బాధ చూడలేక కన్నతండ్రిని స్నేహితుల సహాయంతో అతి దారుణంగా హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.వివరాల్లోకెళితే.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగం గ్రామంలో( Sangam village ) చిన్న మలయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం.
డబ్బు సంపాదించడం కోసం చిన్న మల్లయ్య దుబాయ్ వెళ్ళాడు.డబ్బులు సంపాదించి కూతురికి వివాహం కూడా చేశాడు.
ఆ తర్వాత ఇంట్లో తల్లీ కొడుకులు కలిసి ఉంటున్నారు.అయితే మూడు నెలల క్రితం చిన్న మల్లయ్య దుబాయ్ నుండి ఇండియాకు తిరిగివచ్చాడు.

మల్లయ్య( Mallaiah ) వచ్చినప్పటినుంచి తరచూ భార్యతో గొడవపడేవాడు.మల్లయ్యకు తన కొడుకు ఎన్నిసార్లు సర్ది చెప్పిన గొడవలు మాత్రం తరచూ జరుగుతూనే ఉండేది.ఇక రోజురోజుకు మల్లయ్య వేధించడం అధికం కావడంతో.రెండు నెలల క్రితం వల్లంపల్లి లో ఉంటున్న సోదరి ఇంటికి ఆ తల్లి, కొడుకులు వెళ్లారు.అయినా కూడా ఫోన్ చేసి గొడవ పడుతూ ఉండడంతో తిరిగి ఇంటికి వచ్చారు.తర్వాత పీకల తాక మద్యం తాగి నీకు అక్రమ సంబంధం ఉంది అంటూ భార్యను విచక్షణ రహితంగా కొట్టాడు.

ఇక తాజాగా జూన్ 1న రాత్రి మల్లయ్య తన కొడుకు కు ఫోన్ చేసి గొడవ పెట్టుకున్నాడు.ఇక తండ్రి ఆగడాలను భరించలేక ఆ కొడుకు స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చి రోకలిబండ, కర్రలతో తలపై దాడి చేశాడు.వెంటనే చిన్న మల్లయ్య రక్తపు మడుగులోకి జారి ప్రాణాలు విడిచాడు.ఆ కొడుకు స్నేహితులతో కలిసి పరారయ్యాడు.పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.