పెరుగు..( Curd )పాల నుండి తయారయ్యే ఉత్పత్తుల్లో ఒకటి.పెరుగు లేనిదే భోజనం సంపూర్ణం కాదు.
చాలా మంది పెరుగుతూనే భోజనాన్ని పూర్తి చేస్తుంటారు.పెరుగు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది.
నిత్యం ఒక కప్పు పెరుగు తీసుకుంటే అనేక ఆరోగ్య లాభాలు పొందవచ్చు.అలాగే చర్మ సౌందర్యానికి కూడా పెరుగు ఉపయోగపడుతుంది.
అందుకే పెరుగుతో అందానికి మెరుగులు దిద్దుతుంటారు.అయితే ఏయే సమస్యకు పెరుగుని ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ చర్మం ఒక్కోసారి నిర్జీవంగా మారుతుంది.దాంతో ముఖంలో గ్లో ( Glow )అనేది ఉండదు.అలాంటి టైం లో ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.క్షణాల్లో చర్మం బ్రైట్ గా మారుతుందిమొటిమలకు చెక్ పెట్టడానికి పెరుగు అద్భుతంగా సహాయపడుతుంది.వన్ టేబుల్ స్పూన్ పెరుగులో పావు టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు పొడి వేసి మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించే ముందు ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.ఇలా రోజు నైట్ చేస్తే మొటిమలు దెబ్బకు పరారవుతాయి.
వన్ టేబుల్ స్పూన్ పెరుగులో రెండు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్( Tomato juice ) వేసి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుని కడిగేయాలి.ఇలా చేస్తే చర్మం పై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా సరే మాయం అవుతాయిడార్క్ సర్కిల్స్ తో బాధపడేవారు వన్ టేబుల్ స్పూన్ పెరుగులో మూడు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ రసం కలపాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.20 నిమిషాల అనంతరం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ ( Dark circles )దూరం అవుతాయి.
చర్మ ఛాయను పెంచడానికి కూడా పెరుగు హెల్ప్ చేస్తుంది.రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ ను మిక్స్ చేసి ప్యాక్ లా అప్లై చేసుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజు ఇలా చేస్తే మీ చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.