యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి శృతిహాసన్ కెరియర్ మొదట్లో వరుస ఫ్లాప్ సినిమాలను చేసి ఏకంగా ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.అయితే తనలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ నేడు అగ్ర హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.
ఇలా ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఈ ముద్దుగుమ్మ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
కెరియర్ మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈమె క్రాక్ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోల సరసన సినిమాలలో నటించే అవకాశాలను దక్కించుకుంది.
ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన సలార్, బాలకృష్ణ nbk 107 మెగాస్టార్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా అగ్ర హీరోల సరసన భారీ బడ్జెట్ సినిమాలలో నటించడంతో ఇండస్ట్రీలో ఈమెకు భారీ డిమాండ్ పెరిగిపోయింది.

ఇలా అగ్రతారగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్న శృతిహాసన్ తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చేసినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈమె ఇదివరకు ఒక్కో సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది.అయితే ప్రస్తుతం తన సినిమాలకు ఏకంగా రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.ఇలా ఈమె రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో ఈమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు సైతం ఆమె అడిగిన మొత్తం ముట్ట చెప్పడానికి సానుకూలంగా ఉన్నారు.







