గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలో తన కుమారుడు న్యాయ కర్మదాత అయినా శని ఇంట్లోకి ప్రవేశించాడు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు శని మధ్య శత్రుత్వం భావన ఉంది.
అటువంటి పరిస్థితులలో శని ఇంట్లో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు దాని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంది.సూర్యుడు శని ప్రభావం వల్ల ఈ రాశుల్లో కొలహాలం ఏర్పడుతుంది.
అందుకే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మిధున రాశి వారి జాతకంలో మూడవ ఇంటికి అధిపతి సూర్యుడు ఒక వ్యక్తి ధైర్యం పరాక్రమం ఈ ఇంటి నుంచి పరిగణించబడుతుంది.సూర్యుడు మీ ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు.
ఈ ఇంట్లో సూర్యుడు సంచారం మీకు శుభం కాదు.ఈ రాశి వారు నోటిని కాస్త అదుపులో పెట్టుకోవడం మంచిది.
కార్యాలయంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.అందుకే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మకర రాశి వారికి సూర్యుడు ఎనిమిదవ ఇంటికి అధిపతి.జీవితంలో ప్రమాదాలు, ప్రమాద సంఘటనలు ఈ ఇంటి నుంచి పరిగణించబడతాయి.సూర్యుడు మీ లగ్నంలో సంచరిస్తున్నాడు.దీనివల్ల పనులలో కాస్త ఆలస్యం ఏర్పడుతుంది.భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
కుంభ రాశి వారికి సూర్యుడు మరక స్థానానికి అధిపతి.సూర్యసంచారము ఈ రాశి వారి 12వ ఇంట్లో జరిగింది.ఈ సమయంలో ఈ రాశి వారు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.
పురోగతికి సమయం పడుతుంది.దిగువ ఎగుమతికి సంబంధించిన వ్యాపారంలో ఇంకా ఇబ్బందులు ఉంటాయి.జనవరి 14వ తేదీ ఉదయం 8.21 నిమిషములకు సూర్యుడు ధనస్సు రాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశించాడు.ఇది ఫిబ్రవరి 13.2023 వరకు ఇక్కడే ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.అదే సమయంలో శని ప్రస్తుతం మకర రాశిలో సంచరిస్తూ జనవరి 17న మకర రాశిని వదిలి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.