సాధారణంగా కొందరిలో ఆకలి అనేది చాలా అధికంగా ఉంటుంది.దీన్నే అతి ఆకలి( Extreme Hunger ) అంటారు.
అతి ఆకలి కారణంగా తరచూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు.క్రమంగా ఇది అధిక బరువుకు( Over Weight ) దారితీస్తుంది.
మధుమేహం, గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.అందువల్ల తినడం తగ్గించాలి.
తినడం తగ్గించాలి అంటే అతి ఆకలి సమస్యకు చెక్ పెట్టాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

జ్యూస్ తయారీ కోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ బొప్పాయి పండు ముక్కలు( Papaya ) వేసుకోవాలి.అలాగే ఒక అరటి పండును( Banana ) స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.వీటితో పాటు అర కప్పు పీల్ తొలగించిన కీర దోసకాయ స్లైసెస్,( Cucumber ) ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బరి నీళ్ళు( Coconut Water ) మరియు రెండు టేబుల్ స్పూన్లు స్వచ్ఛమైన తేనె( Pure Honey ) వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
దాంతో టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ రెడీ అవుతుంది.

ఈ పపాయ బనానా కీరా జ్యూస్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.అలాగే ఈ జ్యూస్ కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.
అతి ఆకలి సమస్యను దూరం చేస్తుంది.ఆహార కోరికలను అణచివేస్తుంది.
దాంతో తినడం తగ్గిస్తారు.ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది.
అంతేకాకుండా ఈ పపాయ బనానా కీరా జ్యూస్( Papaya Banana Cucumber Juice ) బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.కంటి చూపును పెంచుతుంది.చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది.
బోన్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తుంది.క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గిస్తుంది.