తెలుగు ప్రేక్షకులకు నటుడు అజయ్ ఘోష్( Ajay Ghosh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచు కున్నారు.
అయితే ఎక్కువ శాతం సినిమాలలో విలన్ గా నటించారు.స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా మారారు.
అయితే ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ అయినప్పటికి చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు.గతంలో ఆయన రోడ్లపై చాలా సింపుల్గా తిరుగుతూ జనాలను చాలా సింపుల్ గా మాట్లాడిస్తున్న వీడియోలు ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇంటర్వ్యూలో బాగా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా అజయ్ ఘోష్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.ఒకప్పుడు నాకు వేసుకోవడానికి దుస్తులు కూడా లేవు.మా అన్నయ్య వాళ్ల స్నేహితులు వాడేసిన డ్రెసులు తెచ్చుకొని వేసుకునేవాడిని.ఎన్నో విషయాల్లో ఒత్తిడికి గురై నష్టాలను చూశాను.ఆ తర్వాత.
ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుందని ఆలోచించడం మానేశాను.నాకు మొదటి నుంచి కష్టాలెక్కువే.
నేను బతుకుదెరువు కోసం హైదరాబాద్( Hyderabad ) వచ్చినప్పుడు నా పిల్లలు కూడా ఎన్నో కష్టాలు అనుభవించారు.

వాళ్లకు తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు.ఎన్నో రోజులు పచ్చడి మెతుకులు తినే బతికారు.అలా ఇబ్బందుల్లో పెరిగారు కాబట్టే వాళ్లు ఇప్పుడు ఎంతో క్రమశిక్షణగా ఉన్నారని నేను అనుకుంటాను.
నేను ఎన్నో అవమానాలు, బాధలు పడ్డాను. నా వెనక నా గురించి దారుణంగా మాట్లాడేవాళ్లు.
ఎందుకూ పనికిరాను అనేవారు.అవన్నీ నాకు వినిపించినా మౌనంగా వచ్చేసేవాడిని.
అలాంటి మాటలే నాకు ఆశీర్వచనాలు అనుకున్నాను.చిన్నప్పటి నుంచి నేను భోజనప్రియుడినే.
అన్నం ఉంటే చాలు.మా నాన్న( my father ) నా కడుపు నింపడం కోసం ఆయన తినకుండా భోజనం ఉంచేవాడు.
నేను తిన్న తర్వాత మిగిలితే ఆయన తినేవాడు.లేదంటే తినకుండా ఉండేవాడు.
కష్టాలు లేకపోతే మనిషి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేడు.నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని భగవంతుడు ఇచ్చాడు అని చెబుతూ అజయ్ ఘోష్ భావోద్వేగానికి గురయ్యారు.