ఆ స్టార్ డైరెక్టర్ కు ఒకేసారి షాకిచ్చిన చిరంజీవి, బాలయ్య.. ఏం జరిగిందంటే?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న హీరోలకైనా డైరెక్టర్ లకి అయినా అలాగే నిర్మాతలకైనా ఏదో ఒక సమయంలో ఒడిదుడుకులు రావడం అన్నది సహజం.అలాంటి సందర్భాలలో వారు ఎంతో మానసిక వేదనకు గురవుతూ ఉంటారు.

 That Director Was Removed From Chiranjeevi And Balakrishna Films At The Same Tim-TeluguStop.com

కాకపోతే ఆ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.తను డైరెక్ట్‌ చేయబోయే సినిమాల నుంచి తనని తప్పిస్తే ఎలాంటి బాధ కలుగుతుందో అది అనుభవించే వాళ్లకు మాత్రమే అర్థం అవుతుంది.

అలా ఒకసారి చిరంజీవి, బాలకృష్ణ( Chiranjeevi, Balakrishna ) వంటి హీరోల సినిమాల నుంచి ఆ డైరెక్టర్‌ ని తప్పించారు.అతని పేరు తాతినేని ప్రసాద్‌.

లెజండరీ డైరెక్టర్‌ తాతినేని ప్రకాశరావు ( Director Tatineni Prakasa Rao )తనయుడు తాతినేని ప్రసాద్‌( Tatineni Prasad ).తండ్రి లాగే దర్శకుడిగా మారి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు ప్రసాద్.అందులో చిరంజీవి సక్సెస్‌ఫుల్‌ గా హీరోగా పేరు తెచ్చుకొని ఖైదీ చిత్రంతో స్టార్‌ హీరో రేంజ్‌ కి ఎదిగిన రోజులు.అదే సమయంలో బాలకృష్ణ ( Balakrishna )సోలో హీరోగా నటించిన తొలి సినిమా సాహసమే జీవితం విడుదలైంది.

తనతో ఎన్నో అద్భుతమైన సినిమాలను రూపొందించిన తాతినేని ప్రకాశరావు అంటే ఎన్‌.టి.ఆర్‌ కు ఎంతో గౌరవం.ఆయన తనయుడు ప్రసాద్‌ అంటే కూడా ఎంతో అభిమానం.

ఆ కారణంగానే బాలకృష్ణతో మూడు సినిమాలు చేసే అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్‌.అలా డిస్కోకింగ్‌, ఆత్మబలం, పల్నాటి పులి చిత్రాలను రూపొందించారు తాతినేని ప్రసాద్‌.

ఆ తర్వాత ఎఎన్నార్‌, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఒక సినిమా చేసే అవకాశం ఇచ్చారు జగపతి సంస్థ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్‌( VB Rajendraprasad ).ఇదిలా ఉంటే నాదెండ్ల భాస్కరరావు వల్ల ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.ఆ సమయంలో నాదెండ్ల భాస్కరరావుకు మద్దతుగా ఉన్నారు తాతినేని ప్రకాశరావు.తమను కాదని నాదెండ్లతో చేరిన ప్రకాశరావు కుమారుడికి బాలకృష్ణను అప్పగించడం, ఆయనతోనే వరసగా సినిమాలు చేయడం ఎన్టీఆర్‌ వర్గీయులకు నచ్చలేదు.

తాతినేని ప్రసాద్‌ ను బాలకృష్ణ సినిమా నుంచి తప్పించాలని ఎన్టీఆర్‌ కు సూచించారు.అయితే ఆయన ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఆయన సోదరుడు త్రివిక్రమరావు మాత్రం వి.వి.రాజేంద్రప్రసాద్‌కి ఫోన్‌ చేసి ప్రసాద్‌ని ఆ సినిమా నుంచి తప్పించమని చెప్పారట.

Telugu Balakrishna, Chiranjeevi, Tollywood-Movie

అప్పుడు రాజేంద్రప్రసాద్‌ అదే విషయాన్ని ప్రసాద్‌కి చెప్పారట.దానికి మీరు మాత్రం ఏం చేస్తారు.ఫర్వాలేదు లెండి అన్నారట ప్రసాద్‌.ఆ సినిమా పేరు భార్యాభర్తల బంధం.మరో డైరెక్టర్‌ కి అవకాశం ఇవ్వకుండా వి.బి.రాజేంద్రప్రసాదే ఆ సినిమాను డైరెక్ట్‌ చేశారట.అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు చిరంజీవి( Chiranjeevi ) హీరోగా తాతినేని ప్రసాద్‌ డైరెక్షన్‌ లో పులి చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది.

మైసూర్‌లో మరో సినిమా షూటింగ్‌ లో ఉన్న ప్రసాద్‌ అది పూర్తి చేసి వారం రోజుల్లో చిరంజీవి సినిమా స్టార్ట్‌ చెయ్యాల్సి ఉంది.దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా కంప్లీట్‌ అయిపోయింది.

ఆ సినిమాకి నిర్మాత ఆనం గోపాల కృష్ణ.

Telugu Balakrishna, Chiranjeevi, Tollywood-Movie

బాలకృష్ణ సినిమా నుంచి ప్రసాద్‌ ను తొలగించారని తెలిసిన తర్వాత చిరంజీవి సన్నిహితులు ఆయనకు ఈ విషయం చెప్పి అతన్ని ఎంకరేజ్‌ చెయ్యొద్దని సలహా ఇచ్చారట.ఈ విషయాన్ని నిర్మాత గోపాలకృష్ణకు చెప్పి వేరే డైరెక్టర్‌ తో చేద్దాం అన్నారటచిరంజీవి.అయితే ఇది ఆయనకు చివరి క్షణం వరకు తెలీదు.

మైసూర్‌ నుంచి చెన్నయ్‌ వచ్చిన తర్వాత పులి చిత్రం నుంచి తనను తొలగించారని తెలిసింది.చిరంజీవి అలాంటి నిర్ణయం తీసుకునే మనిషి కాదని ప్రసాద్‌కి అనిపించి వెంటనే వెళ్ళి ఆయన్ని కలిశారట.

తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చిరంజీవి చెప్పడంతో చేసేది లేక వెనుతిరిగారట ప్రసాద్‌.డైరెక్టర్‌ గా మంచి పొజిషన్‌ లో ఉన్న తాతినేని ప్రసాద్‌కు ఈ రెండు ఘటనలతో సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube