కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్( Hero Dhanush ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సార్ సినిమాతో ఈ ఏడాది ధనుష్ సక్సెస్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులో పెద్ద్ హిట్ గా నిలిచింది.
సినిమా సినిమాకు సక్సెస్ రేట్ ను పెంచుకోవడంతో పాటు ఫ్యాన్స్ కు దగ్గరవుతున్న ధనుష్ ఒక సందర్భంలో చదువు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ధనుష్ చదువు గొప్పదనం గురించి చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్( Captain Miller ) అనే సినిమా షూట్ లో పాల్గొంటున్న ధనుష్ త్వరలో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రస్తుతం మూడు కంటే ఎక్కువ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్న ధనుష్ సినిమా షూటింగ్ ల వల్ల నా చదువు మధ్యలోనే ఆగిపోయిందని అన్నారు.
తాను గ్రాడ్యుయేషన్ సైతం పూర్తి చేయలేదని ధనుష్ తెలిపారు.
ఇంగ్లీష్( English ) లో మాట్లాడటం రాకపోవడం వల్ల తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆయన పేర్కొన్నారు.
సినిమాలలో నటించే హీరోలలో కొంతమంది చదువు రాని వాళ్లు ఉంటారని రియల్ లైఫ్ లో మాత్రం ఎవరైతే చదువుకుంటారో వాళ్లే హీరో అని ధనుష్ చెప్పుకొచ్చారు.అందువల్ల పిల్లలను మంచి చదువులు చదివించాలని ధనుష్ కామెంట్లు చేశారు.
ధనుష్ చెప్పిన విషయాలతో నెటిజన్లు సైతం ఏకీభవిస్తున్నారు.

తన సక్సెస్ స్టోరీతో ధనుష్( Dhanush Success Story ) ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.కెరీర్ తొలినాళ్లలో నటుడిగా సైతం ధనుష్ కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి.సినిమాలు సక్సెస్ సాధించినా హీరో అందంగా లేడని కొంతమంది కామెంట్లు చేశారు.
అయితే ధనుష్ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.సినిమా సినిమాకు ధనుష్ రేంజ్ పెరుగుతోంది.