తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్, డైరెక్టర్ వేణు( Director Venu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట జబర్దస్త్ కమెడియన్ ( Jabardast comedian )గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న వేణు తాజాగా బలగం సినిమాతో( Balagam movie ) డైరెక్టర్ గా మారి పెద్ద పెద్ద ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా బలగం సినిమా పేరు వినిపిస్తోంది.చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
దాంతో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు.అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పగలు ప్రతికారాలతో దూరమైన చాలా కుటుంబాలు ఇప్పటికే బలగం సినిమా వాళ్ళ దగ్గర అయిన విషయం తెలిసిందే.
కాగా ఈ బలగం సినిమా ఆశించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టింది.అంతేకాకుండా ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టాల్సిందే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు.
మరి ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ తో ఈ చిత్రాన్ని హృదయానికి హత్తుకునేలా ఎంతో ఎమోషనల్ గా ముగించారు వేణు.ఈ చిత్రం గ్రామాల్లోకి కూడా చొచ్చుకుని పోయింది.
మారుమూల గ్రామాల్లో సైతం ఈ చిత్రాన్ని ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికీ బలగం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ చిత్రానికి అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా వస్తున్నాయి.

ఇదిలా ఉండగా దర్శకుడు వేణు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో( Sridevi Drama Company Show )కి అతిథిగా హాజరయ్యారు.శ్రీదేవి డ్రామా కంపెనీషోలో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, యాంకర్ రష్మీ, ఇంద్రజ, రోహిణి ఈ షోలో కామెడీతో పెద్ద హంగామానే చేశారు.హైపర్ ఆది, బులెట్ భాస్కర్ లాంటి వాళ్ళు కామెడీ పంచ్ లు వేస్తుంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో వీరి కామెడీ నవ్వించే విధంగా ఉంది.అయితే ఎంచుకున్న స్కిట్ మాత్రం నెటిజన్లకు అంతగా నచ్చడం లేదు.బలగం చిత్రంలోని సన్నివేశాల పేరడీతో హైపర్ ఆది, తాగుబోతు రమేష్, బుల్లెట్ భాస్కర్ కామెడీ చేశారు.ఇది కొందరు నెటిజన్లకు నచ్చడం లేదు.

అది కూడా బలగం దర్శకుడు వేణు ముందే వాళ్ళు కామెడీ చేశారు.బలగం చిత్రంలో కొమరయ్య మరణించే సన్నివేశాలు,ఆ తర్వాత కాకికి పిండం పెట్టే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి.కానీ ఆ సన్నివేశాలని శ్రీదేవి డ్రామా కంపెనీలో అపహాస్యం చేశారు.ఈ స్కిట్ లో హైపర్ ఆది, తాగుబోతు రమేష్, భాస్కర్ ప్రధానంగా నటించగా యాంకర్ రష్మీ కూడా పాల్గొంది.
చివర్లో బలగం తరహాలో జబర్దస్త్ ప్రవీణ్ పాట పడుతూ హైపర్ ఆది, రష్మీ ఇలా ఒక్కొక్కరి గురించి కామెడీగా వివరించి అలరించాడు.తరువాత రష్మీ గురించి పాట పాడుతూ గాలోడు గాలోడు అంటే గాలికి పోయాడు ఈమె ఇక్కడే ఉండిపోయింది అంటూ ప్రవీణ్ నవ్వించారు.
కాగా కొందరు ఈ స్కిట్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఎమోషనల్ సన్నివేశాలను కాస్త కామెడీ సన్నివేశాలుగా మార్చేశారు అంటూ మండిపడుతున్నారు.