Trisha : పీఎస్2 తర్వాత త్రిష వెబ్ సిరీస్ లో నటించనుందా.. ప్రేక్షకులు ఆదరిస్తారా?

స్టార్ హీరోయిన్ త్రిష గురించి మనందరికీ తెలిసిందే.త్రిష( Trisha ) ప్రస్తుతం దక్షిణ భారత సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న విషయం తెలిసిందే.

 Trisha Is First Time Signed A Web Series And It Is Getting Released After Ps 2-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అగ్ర హీరోయిన్గా రాణించడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు.ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది త్రిష.

అవకాశాల విషయంలో మాత్రమే కాకుండా అందం విషయంలో కూడా ముద్దుగుమ్మ ఏ మాత్రం తగ్గడం లేదు.వయసు పెరుగుతున్న కూడా వన్నెతరగని అందంతో యువత గుండెల్లో గుబులు రేపుతోంది.

Telugu Brinda, Kollywood, Mani Ratnam, Ps, Tollywood, Trisha, Varsham, Web-Movie

తెలుగులో వర్షం( Varsham ), నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పిఎస్2( ponniyin selvan 2 ) సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఇందులో త్రిష ప్రధాన పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.అలాగే ప్రస్తుతం ఈమె లోకేష్ కనగరాజ్ విజయ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.అయితే పిఎస్2 తర్వాత త్రిష ఎటువంటి సినిమాలు నటించనుంది ఆ పాత్ర ఎలా ఉండబోతుంది అన్న సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.

Telugu Brinda, Kollywood, Mani Ratnam, Ps, Tollywood, Trisha, Varsham, Web-Movie

తాజాగా అందిన సమాచారం ప్రకారం.త్రిష పిఎస్2 తర్వాత మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోందట.ఆ వెబ్ సిరీస్ టైటిల్ బృంద( Brinda ).దీనికి తెలుగు దర్శకుడు సూర్య వంగల దర్శకత్వం వహించగా, ఆశిష్ కొల్ల దీనికి నిర్మాత.ఇది సోనీ లివ్ కోసం నిర్మిస్తున్న వెబ్ సిరీస్.ఈ సినిమా పోలీస్ నేపథ్యంలో రాబోతుంది.ఇందులో క్రైమ్ ఎలిమెంట్, నేరపరిశోధన ఇంకా చాలా ఎలెమెంట్స్ వున్నాయట.ఇది ఎనిమిది ఎపిసోడ్స్ గా మొదటి సీజన్ లో రానుందట.

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయింది.

Telugu Brinda, Kollywood, Mani Ratnam, Ps, Tollywood, Trisha, Varsham, Web-Movie

ఇందులో త్రిష ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రని వేస్తోంది.ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుండబోతోంది అని తెలిసింది.అయితే మొదటి సారిగా త్రిష చేస్తున్న వెబ్ సిరీస్ ఇదే.ఈ వెబ్ సిరీస్ తెలుగులోనే మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో కూడా విడుదల అవుతుంది.ఫామిలీ మేన్ లో నటించిన చాలామంది నటులను ఈ వెబ్ సిరీస్ లో తీసుకున్నారని కూడా తెలిసింది.

పొన్నియన్ సెల్వన్ 2 విడుదల అయిన తరువాత త్రిష విడుదల ఈ వెబ్ సిరీస్ నటించనుంది.ఇది జూన్, జులై లో విడుదల కావచ్చు అని తెలిసింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube