“స్త్రీ”కి మాత్రమే కలిగే ఒక గొప్ప అవకాశం ఈ భూమిమీద జీవిస్తున్న అనేకమందికి జన్మనివ్వడం.చాలా మంది స్త్రీలు గర్భం దాల్చిన తరువాత కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం వలన పుట్టే బిడ్డలు అనేక లోపాలతో పుడుతున్నారు.
అందుకే తినే తిండి విషయం నుండి పడుకునే సమయం ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్త వహించాలి.
ముఖ్యంగా గర్భిణులు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి అతిగా నాన్‌వెజ్ తినకూడదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
దీనివల్ల బిడ్డకు గర్భంలోనే మనోవైకల్యం కలిగే అవకాశాలుంటాయంటున్నారు.చికెన్, బీఫ్, నట్స్, డైరీప్రోడక్ట్స్, చీజ్, బీన్స్‌లో ఇది ఓవర్ లోడై ఉంటుంది.
వీటిని గర్భిణీలు ఎక్కువ తినకూడదు.
ఈ రకమైన ఆహారాన్ని తీసుకోవడం వలన గర్భస్థ శిశువు ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది అని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫిసర్ “అమల్ ఆల్కర్” పేర్కొన్నారు.
ఎలుకలపై వీరు చేసిన పరిశోధనలని.ఇంకా లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
స్కిజోఫ్రోనియా అనేది దీర్ఘకాలిక మనోవైకల్యం.దీనిబారిన పడే వాళ్ళు ఉన్నది లేనట్టుగా.
లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని భ్రాంతిలో ఉంటారు.ఇప్పుడు దీనికి విరుగుడుగా మరొక మందును కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్నట్టు తెలిపారు.