రామ్ పోతినేని - లింగుస్వామి 'ది వారియర్'లో 'బుల్లెట్...' సాంగ్ పాడిన కోలీవుడ్ స్టార్ శింబు

ఉస్తాద్ రామ్ పోతినేని, కోలీవుడ్ స్టార్ శింబు, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మంచి ఫ్రెండ్స్.శింబులో మంచి సింగర్ కూడా ఉన్నాడు.

 Simbu Sings Bullet Song For Ram Pothineni's The Warriorr , Simbu , Ram Pothineni-TeluguStop.com

తన స్నేహితుల కోసం ఆ సింగర్ ఓ పాట పాడాడు.త్వరలో ఆ పాటను విడుదల చేయనున్నారు.

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘ది వారియర్‘.తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

ఈ సినిమాలో ‘బుల్లెట్…’ సాంగ్‌ను శింబు ఆలపించారు.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “మా హీరో రామ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్‌తో ఉన్న ఫ్రెండ్షిప్‌తో శింబు ‘బుల్లెట్…’ సాంగ్ పాడారు.

ఇదొక మాస్ నంబర్.సినిమా హైలైట్స్‌లో ఈ సాంగ్ ఒకటి అవుతుంది.

దేవిశ్రీ ప్రసాద్ ఫెంటాస్టిక్ ట్యూన్‌కు, శింబు వాయిస్ యాడ్ అవ్వడంతో సాంగ్ సూపర్ గా వచ్చింది.ఈ పవర్ ప్యాక్డ్ సాంగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది.

దీంతో పాటు మిగతా పాటలకూ దేవిశ్రీ హిట్ ట్యూన్స్ ఇచ్చారు.ఇటీవల భారీ ఎత్తున ఇంటర్వెల్ సీన్, హీరో హీరోయిన్లపై ఒక పాటను చిత్రీకరించాం.

చిత్రీకరణ చివరి దశకు వచ్చింది.ఆల్రెడీ విడుదల చేసిన రామ్ స్టిల్స్, ఆది పినిశెట్టి లుక్స్, కృతి శెట్టి లుక్స్ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

సినిమాపై అంచనాలు పెంచాయి.ఆ అంచనాలను అందుకునేలా లింగుస్వామి సినిమాను తెరకెక్కిస్తున్నారు” అని చెప్పారు.

ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు.

అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube