ప్రతి ఆడవారిలో రజస్వల అయిన సమయం నుంచి మెనోపాజ్ దశ చేరేవరకూ నెలసరి వస్తుంది.వాస్తవానికి మహిళల శరీరం అనేది గర్భం దాల్చేందుకు నెలనెలా రెడీ అవుతుంది.
అయితే భాగస్వామితో కలవకపోతే గర్భం కోసం రెడీ అయిన కొన్ని ద్రవాలు వారి శరీరం నుంచి బయటకు విడుదల అవుతాయి.ఇందులో టిష్యూ పదార్థంతో పాటు రక్తం కూడా ఉంటుంది.
అయితే ప్రతినెలా యోని ద్వారా బయటకు వచ్చే ఈ రక్తస్రావాన్ని పీరియడ్స్ లేదా రుతుస్రావం అని పిలుస్తారు.ఈ పీరియడ్ రక్తాన్ని కొందరు చెడు రక్తంగా లేదా శరీరంలోని ఒక వ్యర్థంగా భావిస్తుంటారు.
ఈ రక్తాన్ని తాకడానికి కూడా ఎవరూ ఇష్టపడరు.కానీ ఒక మహిళ మాత్రం పీరియడ్స్ రక్తాన్ని కాఫీ తాగినట్టుగా తాగేస్తోంది.
చాలా రోజులుగా ఇలా తాను తన పీరియడ్స్ రక్తాన్ని సేవిస్తున్నట్లు ఆమె తాజాగా ప్రకటించడంతో అందరూ నివ్వెరపోతున్నారు.ఈ పీరియడ్స్ రక్తం తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని కూడా ఆమె చెబుతుండటం విస్తుగొలుపుతోంది.
వివరాల్లోకి వెళితే… స్పెయిన్‌లోని బార్సెలోనాకి చెందిన జాస్మిన్ అలీసియా కార్టర్ (Jasmine Alicia carter) అనే మహిళకు 30 ఏళ్ల వయసు ఉంది.ఇప్పటికే ఈమె వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.
గతంలో హోటల్లో వెయిట్రెస్‌గా పనిచేసిన జాస్మిన్ ఇప్పుడు పీరియడ్స్ సమస్యలకు సంబంధించిన సలహాలను పలువురికి తెలియజేయడమే పనిగా పెట్టుకుంది.ఇందులో భాగంగా తాజాగా తాను తన పీరియడ్స్ రక్తాన్ని సేవిస్తానని చెప్పింది.ఋతుక్రమం వచ్చే రోజు ఒక కప్పులో పీరియడ్స్ రక్తాన్ని పట్టుకుని… దాన్ని తాగుతానని ఆమె చెప్పడంతో ఇప్పుడు అందరూ నోరెళ్లబెడుతున్నారు.
ఛీ… ఆ రక్తం ఎలా తాగుతారు? నువ్వు మనిషివా లేక రాక్షసివా? అని కొందరు ఆమెను తిట్టిపోస్తున్నారు.అయితే ఆమె మాత్రం ఎవరి గురించి పట్టించుకోకుండా పీరియడ్స్ రక్తాన్ని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతోంది.చాలా రోజుల నుంచి తాను పీరియడ్స్ రక్తాన్ని తాగుతున్నానని… అయినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నానని… తనకేం కాలేదని ఆమె చెబుతుండటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దీనికి కారణం స్వచ్ఛమైన రక్తంలో కంటే ఇందులో 40 రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉంటుందని ఆమె చెబుతోంది.అంతేకాదు ఈమె తన పీరియడ్స్ రక్తాన్ని ఫేషియల్ మాస్క్ గా కూడా ఉపయోగిస్తోంది.
ఏది ఏమైనా ఈ జుగుప్సాకరమైన అలవాటును చూసి నెటిజన్లు ఛీ కొడుతున్నారు.